వైరల్‌: ‘‘త్వరలో యుగాంతం.. ఇదే నిదర్శనం’’

7 Apr, 2021 17:22 IST|Sakshi

నెటిజనులను భయభ్రాంతులకు గురి చేస్తోన్న జీవి

వాషింగ్టన్‌: నాలుగు కంటే ఎక్కువ కాళ్లతో జన్మించిన జంతువులు, వేప చెట్టు నుంచి పాలు, కల్లు వంటి పదార్థాలు కారడం వంటి అసాధారణ దృశ్యాలు ఏవైనా మన చూట్టు కనిపిస్తే చాలు వెంటనే వినిపించే మాట యుగాంతం రాబోతుంది. ఇలాంటి వింతలు జరిగితే యుగాంతం తప్పదని.. దీని గురించి ఫలానా గ్రంథంలో చెప్పారని.. ఫలానా వ్యకి చెప్పారని ప్రచారం మొదలు పెడతారు. ఇప్పుడు యుగాంతం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే తాజాగా ఓ వింత జంతువు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. దీన్ని చూసిన వారంతా.. యుగాంతం రాబోతుంది అంటున్నారు. ఇంతకు ఆ జంతువు ఏంటి.. ఎక్కడ కనిపించింది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవండి. రెండు రోజుల క్రితం టెక్సాస్‌కు చెందని ఓ టిక్‌టాక్ యూజర్‌ ఎలుకను పోలిన ఓ వింత జంతువుకు సంబంధించిన వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అప్పటి నుంచి ఇది తెగ వైరలవుతుంది. 

ఇక వీడియోలో ఉన్న జీవి చూడ్డానికి ఎలుకలా ఉంది. దీనికి మూడు కళ్లు ఉన్నాయి. రెండు కళ్లు ఉండాల్సిన స్థానంలో ఉండగా.. వాటికి పైన మూడో కన్ను ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో ఈ జీవిని చూసిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ‘‘అమ్మో యుగాంతం రాబోతుంది.. అందుకే ఇలాంటి మూడు కళ్ల వింత జీవి కనిపించింది’’ అంటూ కామెంట్‌ చేశారు. కొందరు ధైర్యవంతులు మాత్రం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. ‘‘అది కన్ను కాదు.. అక్కడ వెంట్రుకలు రాలిపోవడం వల్ల చర్మం అలా మూడో కన్నుగా కనిపిస్తుంది’’ అని స్పష్టం చేశారు. మరి కొందరు ఇది హైబ్రీడ్‌ జాతికి చెందిన ఎలుక లేదా ఉడుత అయ్యి ఉంటుందని తెలిపారు. ఓ యూజర్‌ ఈ జంతువును మెలనిస్టిక్ బూడిద ఉడుత అని.. ఇది ఉత్తర అమెరికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది అని తెలిపాడు.

ఇక దాని మూడో కన్నుకు సంబంధించిన రహాస్యాన్ని కూడా వెల్లడించాడు సదరు యూజర్‌. సాధారణంగా పిల్లలకు జన్మనిచ్చే సమయంలో ఈ జీవి గూడు నిర్మించుకోవడం కోసం తన చర్మం నుంచి వెంట్రుకలని తీసుకుంటాయి. తర్వాత అది మళ్లీ తిరిగి పెరుగుతుంది అని తెలిపాడు.

చదవండి: ఓ వైపు కాలిపోతున్నా.. మరోవైపు ఆపరేషన్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు