Blind Elephant: నిస్వార్థమైన గజరాజుల ప్రేమ.. అమోఘం అంటున్న నెటిజన్స్‌

16 Jul, 2021 13:02 IST|Sakshi

ఐకమత్యం మనుషుల కంటే జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి ప్రేమ నిస్వార్థంతో కూడుకున్నది. ఈ విషయాలు ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే వస్తున్నాయి. అంతేకాదు వాటి విశ్వసనీయతకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో అప్పుడప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా థాయ్‌లాండ్‌ నుంచి అలాంటి ఓ సీన్‌.. ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చింది. 

చూపు లేని ఓ ఏనుగుకు ఆహారం కోసం మరో ఏనుగు దారి చూపించడం ఆ వీడియోలో ఉంది. ఎలిఫెంట్‌ నేచర్‌ పార్క్‌ ఫౌండర్‌ లెక్‌ ఛాయ్‌లెర్ట్‌ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ప్లాయ్‌ థాంగ్‌కు చూపు లేదు. కానీ, చనా దాని బాగోగులన్నీ చూసుకుంటోంది. ఈ వీడియోలో దానిని ఆహారం వైపు తీసుకెళ్తోంది. ప్రతీరోజూ ఇలా మనసుకి సంతోషాన్ని కలిగించే దృశ్యాన్ని నేను చూస్తున్నా. ఈ మూగజీవాల నిస్వార్థమైన ప్రేమ.. మనకూ ఒక పాఠం కావాలి’ అని పోస్ట్‌ చేశారు.

A post shared by Lek Chailert (@lek_chailert)

ఇక మరో పాత వీడియో సైతం ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. ప్రముఖ ప్రైమటాలజిస్ట్‌ జేన్‌ గుడ్‌ఆల్‌.. ఓ చింపాజీని కొందరి సాయంతో రక్షించగా, అది తిరిగొచ్చి ఆమెను ఆప్యాయంగా హత్తుకుంది. 2014లో వైరల్‌ అయిన ఈ పాత వీడియో ట్విటర్‌ ద్వారా మరోసారి తెర మీదకు రావడం విశేషం.

>
మరిన్ని వార్తలు