బ్లూ ఆరిజిన్‌ యాత్ర సక్సెస్‌

5 Jun, 2022 06:37 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన అంతరిక్షయాన సంస్థ బ్లూ ఆరిజిన్‌ తన ఐదో పర్యాటక యాత్రను విజయ వంతంగా ముగించింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8గంటల 26నిమిషాలకు వెస్ట్‌ టెక్సాస్‌లోని ప్రయోగకేంద్రం ఇందుకు వేదికైంది.

న్యూ షెపర్డ్‌(ఎన్‌ఎస్‌–21) రాకెట్‌ ఒక మెక్సికన్‌ మహిళసహా ఆరుగురు ప్రయాణికులను 106 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష పర్యటనకు తీసుకెళ్లి సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. మెక్సికో మూలాలున్న ఒక మహిళ(కట్యా ఇచాజెరెట్టా) ఇలా అంతరిక్ష పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతరిక్షంలోకి వెళ్లి అత్యంత పిన్న వయస్కురాలైన అమెరికన్‌గా నూ కట్యా (26) చరిత్ర సృష్టించింది. యాత్ర మొత్తం 10 నిమిషాల్లో పూర్తయింది. 

మరిన్ని వార్తలు