ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు, 32 మంది మృతి

15 Oct, 2021 15:39 IST|Sakshi

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో కాందహార్‌లోని షియా మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షియాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు