అఫ్గాన్‌లో స్కూల్‌ వద్ద భారీ పేలుడు, 55 మంది మృతి

9 May, 2021 04:56 IST|Sakshi
మృతదేహాల వద్ద బంధువులు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్‌ పశ్చిమ ప్రాంతంలో శనివారం తీవ్ర బాంబు పేలుడు సంభవించింది. అఫ్గాన్‌లో మైనారిటీలైన షియాలు అధికంగా నివసించే ప్రాంతంలోని ఓ బాలికల స్కూల్‌ వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. కడపటి వార్తలు అందేసరికి ఈ ఘటనలో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో 150మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 11-15 ఏళ్ల మధ్య విద్యార్థినులే అని అధికారులు వెల్లడించారు.

ఈ దాడికి పాల్పడింది తాము కాదం టూ తాలిబాన్‌ ప్రకటించింది. మరే ఇతర ఉగ్రసంస్థ ఈ పేలుడుకు ఇంకా బాధ్యత వహించుకోలేదు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా, వారికి రక్తదానం చేసేందుకు భారీ స్థాయిలో ప్రజలు ఆస్పత్రుల వద్దకు చేరారు. మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్‌లో మైనారిటీ షియాలపై ఉగ్రసంస్థ ఐసిస్‌ విరుచుకుపడుతోంది.

ఇటీవలే ఓ బాంబు పేలుడు జరిపి పలువురు ప్రాణాలను బలిగొంది. ఈ నేపథ్యంలో తాలిబాన్‌ స్పందిస్తూ, ఇలాంటి హీనమైన పేలుళ్లకు పాల్పడేది ఐసిస్‌ మాత్రమే అని పేర్కొంది. అఫ్గాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజన్సీ సైతం ఐసిస్‌కు సాయపడుతోందని ఆరోపించింది.  
(చదవండి: అమెరికా సంచలన ప్రకటన: అఫ్గాన్‌ నుంచి బలగాలు వెనక్కి)

మరిన్ని వార్తలు