డగ్లస్‌ స్టువార్ట్‌కు బుకర్‌ ప్రైజ్‌

21 Nov, 2020 07:32 IST|Sakshi

లండన్‌: న్యూయార్క్‌కు చెందిన స్కాటిష్‌ రచయత డగ్లస్‌ స్టువార్ట్‌ 2020 సంవత్సర బుకర్‌ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ‘‘షుగ్గీబెయిన్‌’’ పేరిట రచించిన తన ఆత్మకథకు ఆయన 50వేల పౌండ్ల బుకర్‌ ప్రైజ్‌ను సాధించారు. 1980 ప్రాంతంలో గ్లాస్గో నగరంలో జరిగిన ఘటనల సమాహారంగా ఈ నవలను మలచారు. పోటీలో ఐదుగురు రచయితలను తోసిరాజని డగ్లస్‌ ఈ బహుమతి పొందారు. పోటీలో పాల్గొని ఓటమి పొందిన వారిలో భారతీయ మూలాలున్న రచయిత అవని దోషి (రచన: బర్న్ట్‌ షుగర్‌)కూడా ఉన్నారు. రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్‌ అనంతరం డగ్లస్‌ న్యూయార్క్‌కు వచ్చారు. షుగ్గీ బెయిన్‌ పబ్లిష్‌ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించారు.  (చదవండి: జార్జియా రీకౌంటింగ్‌లో బైడెన్‌ గెలుపు)

మరిన్ని వార్తలు