Viral Video: నిప్పు రాజేసిన పర్యటన... యుద్ధానికి సై అంటున్న దేశాలు

2 Aug, 2022 20:31 IST|Sakshi

China Amid Tension With Taiwan: అమెరికా సెనెట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి పర్యటన చివరికి యుద్ధానికి తెరలేపినట్లు తెలుస్తోంది. తొలుత పెలోసి పర్యటన పెద్ద వివాదంగా మారింది. ఆ వివాదం కాస్త ముదరి ఇప్పుడూ ఇరు దేశాల మద్య నిప్పు రాజేసి యుద్ధానికి సంసిద్ధమయ్యేలా చేసింది. చైనా కూడా ఈ పర్యటన పలు పరిణామాలకు దారితీస్తుందంటూ అమెరికాని మొదట నుంచి హెచ్చరించింది. కానీ అమెరికా కూడా వెనక్కి తగ్గేదే లే అంటూ పర్యటించేందుకు సిద్ధం అయ్యింది. ఇది రెచ్చగొట్టే చర్య అని చైనా పదే పదే చెబుతున్న ఖతారు చేయలేదు.

ఆఖరికి రష్యా కూడా చైనాకి మద్దతు ఇస్తూ ఇది కవ్వింపు చర్య అని అమెరికాని హెచ్చరించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్‌ ఈ పర్యటన వ్యక్తిగతమైనది కాదని, ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లితే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. దీంతో అమెరికా అలర్ట్‌ అయ్యి పెలోసి పర్యటన నిమిత్తం తైవాన్‌ ద్వీప సమీపంలో నాలుగు యుద్ధ నౌకలను మోహరించింది.

దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రీక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు చైనా తైవాన్‌ పై యుద్ధానికి సిద్ధం అంటూ తైవాన్‌ సరిహద్దు సమీపంలో భారీగా సాయుధవాహానాలను, ఇతర సైనిక పరికరాలను మోహరించింది. మరోవైపు తైవాన్‌ కూడా యుద్ధానికి సై అంటూ తమ పోరాట పటిమను చూపించేలా తమ ఆయుధాలతో ప్రదర్శన ఇచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల సాయుధ బలగాలకు సంబధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

(చదవండి: యూఎస్‌కి వార్నింగ్‌ ఇచ్చిన రష్యా! ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యే!)

మరిన్ని వార్తలు