గెలుపంటే ఇది అనిపించేలా సాధించింది: వీడియో వైరల్‌

11 May, 2022 21:22 IST|Sakshi

Despite Losing Shoe She Won Track Race: మనం చాలా క్రీడల్లో చూస్తుంటాం. అసలు వాళ్లు ఆ ఆటలో ఓడిపోతారేమో అనుకునే సమయంలో అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచి చూపిస్తారు. అంతెందుకు క్రికెట్‌ మ్యాచ్‌ లేదా టెన్నిస్‌ మరే ఏ ఆటైన ఆ క్రీడాకారులు ఆడుతున్న తీరు చూసి గెలవరని అర్థమైపోతుంది. కానీ వాళ్లు అందరీ అంచనాలను తారుమారు చేసి మరీ మంచి గా ఆడి గెలుస్తారు. అచ్చం అలాంటి సంఘనటనే అమెరికాలో నెబ్రాస్కాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...ప్రముఖ బాక్సర్ టెరెన్స్ క్రాఫోర్డ్ కుమార్తె  7 ఏళ్ల తలయా నార్త్‌వెస్ట్ హై స్కూల్‌లోని  స్ప్రింట్ పోటీ(పరుగుల పోటీ) లో పాల్గొంది. ఐతే ఆ ట్రాక్‌ రేస్‌ మొదలైనప్పుడూ ఆమె కాలి షూ జారిపోతుంది. దీంతో  ఆ రేస్‌లో పాల్గొన్న వాళ్లంతా తలయా కంటే చాలా ముందంజలో ఉన్నారు. కానీ ఆమె ఆ షు వేసుకోవడంలోనే ఉండిపోతుంది.

ఆమె పరుగు మొదలు పెట్టేటప్పటికే చాలా ఆలస్యమవుతుంది. ఆ స్టేడియంలో ఉ‍న్న ప్రేక్షకులంతా ఆమె గెలవదనే అనుకుంటారు. కానీ అందరీ అభిప్రాయలను తలకిందులు చేస్తూ అనుహ్యంగా తనతోటి రేసర్లను వెనక్కి నెట్టి మరీ ముందుంటుంది. చివరికీ ఆ పోటీలో ఆమె గెలుస్తుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: పొట్టు పొట్టు చినిగిన నాశనం అయిన షూస్‌.. ధర తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం)

మరిన్ని వార్తలు