గదిలో మరో వ్యక్తితో లవర్‌.. తలపట్టుకున్న ప్రియుడు

12 Apr, 2021 11:52 IST|Sakshi

ప్రాణంగా ప్రేమించిన యువతికి మనసులో మాట చెప్పేందుకు సిద్ధమయ్యాడు ఓ యువకుడు. తన ప్రేమను తెలిపే ఆ రోజు జీవితాంతం మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా ఉండాలని భావించాడు. అందుకే విభిన్నంగా ఆలోచించి.. మంచి ప్లాన్‌ రెడీ చేసుకున్నాడు. ఇందులో భాగంగా వయోలిన్‌ తీసుకుని.. కొద్ది మంది స్నేహితులను వెంట పెట్టుకుని ప్రియురాలి ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇక ఇంటి బయట నిల్చుని.. షారుఖ్‌ రేంజ్‌లో వయోలిన్‌ ప్లే చేసి.. జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అని అడుగుదాని భావించాడు.

అయితే ఎంతో ఆశతో అక్కడికి వెళ్లిన యువకుడికి జీవితంలో కోలుకోలేని షాక్‌ తగిలింది. తాను ప్రపోజ్‌ చేద్దామని వెళ్లిన యువతి.. అదే సమయానికి తన గదిలో మరో యువకుడితో ఎంజాయ్‌ చేస్తోంది. గదిలో వారు చేసే పని కర్టెన్‌ మీద నీడ రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసిన యువకుడి హృదయం ముక్కలైంది. కోటి ఆశలతో వెళ్లిన యువకుడికి కోలుకోలేని షాక్‌ తగిలింది. దాంతో ఏం చేయాలో పాలుపోక అక్కడే తలపట్టుకుని కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఎవరో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. పాపం.. ఆ కుర్రాడు ఈ షాక్‌ నుంచి కోలుకోవడానికి జీవిత కాలం పడుతుంది అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: అలాంటి ప్రేమను ఒప్పుకోరు.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు