ప్రేయసి గురక భరించలేక ప్రియుడు..

22 Sep, 2020 08:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గురక చాలా మందికి సాధారణ సమస్య. ఇది బాధితుడిని పెద్ద ఇబ్బంది పెట్టకపోయినా పక్కనున్న వారిని బాగా ఇబ్బంది పెట్టే సమస్యే. అలాంటిది మీ భాగస్వామే గురకతో మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. ఆ సమస్య రోజూ ఎదురైతే పరిస్థితి ఏంటి..?. ఇలాంటి పరిస్థితే ఎదురైనా ఓ వ్యక్తి ఆ సమస్యకు ఓ గమ్మత్తయిన పరిష్కారాన్ని కనుగొన్నాడు.

వివరాల్లోకెళ్తే.. 22 ఏళ్ల జాన్‌ అబ్రహం తన ప్రియురాలు షార్ని బ్రైట్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు నిద్రలో గురకపెట్టే సమస్య ఉంది. దీంతో జాసన్‌ అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. అయితే ప్రియురాలు గురక పెట్టకుండా.. ఆ సమయంలో తనను నిద్ర నుంచి లేపకుండా గురక తగ్గించడానికి అనేక ప్రయోగాలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఒక ప్రయోగం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. అదేంటంటే.. ప్రియురాలు గురక పెట్టే సమయంలో జాసన్‌ ఆమె ముఖాన్ని నాకేవాడు. దీంతో ఆమె గురకపెట్టడం ఆపేది.

వారం రోజులపాటు ఇదే పద్ధతిని కొనసాగించాడు. దీంతో క్రమంగా ఆమె గురక తగ్గిపోవడంతో ఈ ప్రేమజంట ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తర్వాత ఒక సందర్భంలో తన ప్రియురాలికి తను పడుతున్న కష్టాల్ని తెలియజేయగా.. షార్ని బ్రైట్‌ షాకైంది. అయితే వెంటనే షార్ని బ్రైట్‌ తన ప్రియుడ్ని ఈ ప్రయోగం మళ్లీ చేస్తావా అని అంటే జాసన్‌ నో కామెంట్‌ అంటూ సమాధానమిస్తున్నాడు. (హైవేపై డ్రాగర్‌ చూపుతూ యువతి హల్‌చల్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా