అందమైన అమ్మాయి.. పాపం ఇలా ఘోరంగా బలైంది

11 Jul, 2021 15:17 IST|Sakshi

అందం కోసం ఇంట్లోనే రకరకాల ప్రయత్నాలు-ప్రయోగాలు చేస్తుంటారు కొందరు. అలాగే ఫ్యాషనెబుల్‌గా కనిపించాలనే తాపత్రయంతో ఓ టీనేజర్‌ చేసిన పని.. ప్రాణాల్నే బలిగొంది. విషాదకరమైన ఈ ఉదంతం ఇప్పుడు బ్రెజిల్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

బ్రసీలియా: మినాస్‌ గెరాయిస్‌ స్టేట్‌లో ఎంగెన్‌హెయిర్‌ కాల్దాస్‌లో ఉంటోంది పదిహేనేళ్ల వయసున్న ఇసాబెల్లా ఎదువార్దా దె సౌసా. ఈ స్కూల్‌ చిన్నారి తన అందానికి మరింత మెరుగులు దిద్దాలనే ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా కంటి భాగానికి రింగ్‌ కుట్టించుకోవాలనుకుంది. అయితే అమ్మతో సహా ఇంట్లో వాళ్లెవరూ ఆమెకు సహకరించలేదు. దీంతో స్నేహితురాలిని ఇంటికి పిలిపించుకుని ఆమె సాయంతో కంటికి పోగు కుట్టించుకుంది. మూడు రోజుల తర్వాత ఇసాబెల్లా ముఖంలో విపరీతమైన మార్పులు వచ్చాయి.

ఇన్‌ఫెక్షన్‌ కావడంతో ముఖం ఉబ్బిపోయి.. కళ్లు పూర్తిగా మూసుకుపోయి ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇన్‌ఫెక్షన్‌ తిరగబడడంతో ప్రాణాల మీదకు వచ్చింది. వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్న తరుణంలో నాలుగుసార్లు గుండెపోటుకు గురైంది ఆ అమ్మాయి. చివరకు శుక్రవారం ఆ టీనేజర్‌ కన్నుమూసింది. 


పిచ్చి ఛాలెంజ్‌లు వద్దు
ఈమధ్య టిక్‌టాక్‌లో పిచ్చి ఛాలెంజ్‌లు కొన్ని వైరల్‌ అవుతున్నాయి. ముఖం నిండా రింగులు కుట్టించుకునే ఛాలెంజ్‌లు వైరల్‌ అవుతున్నాయి. వాటి వల్ల నరాలు దెబ్బతినడంతో పాటు ఇన్‌ఫెక్షన్‌లు, చివరికి హెచ్‌ఐవీ కూడా సోకొచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇక కంటికి రింగు కుట్టించుకున్న తర్వాత ఇజాబెల్లా చూపును కోల్పోయి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ‘ఒక అందమైన అమ్మాయి. నాకు అత్యంత ఇష్టమైన ఇసాబెల్లా.. ఇలా నరకం అనుభవించి చనిపోవడం బాధాకరంగా ఉంది. అందుకే తల్లిదండ్రులు చెప్పేది వినండి. పెద్దలు ఏం చెప్పినా మన మంచికే అని గుర్తించండి’ అని ఆమె దగ్గరి బంధువు ఒకరు చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు