వారు గాడిదపై ప్రయాణిస్తున్నట్టున్నారు!

12 Jun, 2021 17:12 IST|Sakshi

బ్రెసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై సర్వత్రా విమర్షల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన బ్రెజిల్‌లోని ఆగ్నేయ రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటోను సందర్శించి పలు ప్రజా ప్రాజెక్టులను ప్రారంభించడానికి వెళ్లారు.  ఆ సమయంలో అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఓ విమానంలోకి ఎక్కి వారికి హలో చెప్పారు. అయితే ఆ క్షణం ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. కాగా వెనుక నుంచి ప్రయాణీకుల్లో కొందరు మధ్య వేలును చూపుతూ.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "గెట్ అవుట్, బోల్సోనారో!", "జెనోసిడల్ ఉన్మాది!" అంటూ పలువురు ఘాటుగా విమర్షించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. బయటకు వెళ్లండి అనేవారు గాడిదలపై ప్రయాస్తున్నట్టున్నారు అంటూ చమత్కరించారు. 

ఇక కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిపై పోరులో బోల్సోనారో తరచుగా ఫేస్ మాస్క్‌లు, లాక్‌డౌన్‌, వ్యాక్సిన్‌లను విమర్శించారు. కాగా బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి బారిన పడి 4,80,000 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.  అమెరికా తరువాత అత్యధిక మరణాలు బ్రెజిల్‌లోనే చోటుచేసుకున్నాయి.
 

చదవండి: వైరల్‌: పారాచూట్‌తో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌కి.. పసుపు కార్డుతో రిఫరీ

మరిన్ని వార్తలు