యువతి బద్ధకం ఎంత పని చేసింది!

24 Aug, 2020 20:01 IST|Sakshi
రీనీ, తొడభాగంలో వాపు

లండన్‌ : జిమ్‌కు వెళ్లి కొవ్వు కరిగించుకోవటానికి బద్ధకించిన ఓ యువతి కష్టాలను కొని తెచ్చుకుంది. కొవ్వును కరిగించే ఆపరేషన్‌ను ఆశ్రయించి ఇబ్బందులకు గురైంది. ఈ సంఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్‌, స్ట్రాట్‌ఫోర్డ్‌కు చెందిన 24 ఏళ్ల రీనీ డొనాల్డ్‌సన్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను నిర్వహిస్తోంది. ఆమెకు 1,38,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. లావుగా ఉన్న రీనీ జిమ్‌కు వెళ్లి బరువు తగ్గటానికి బద్ధకించింది. సర్జరీ ద్వారా సన్న బడాలనుకుంది. ఇందుకు కోసం టర్కీ వెళ్లి బ్రెజీలియన్‌ బట్‌ లిఫ్ట్‌ సర్జరీ చేయించుకుంది. అనంతరం తాను చేయించుకున్న సర్జరీ గురించి తన యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రచారం చేసింది. అయితే కొద్దిరోజుల తర్వాత సర్జరీ వికటించి తొడ భాగంలో వాపు మొదలైంది. దీంతో మళ్లీ మూడు సార్లు టర్కీ వెళ్లింది. అయినప్పటికీ లాభం లేకపోయింది. ( చనిపోయిన బాలిక బ్రతికింది: గంట తర్వాత..)

దీనిపై స్పందించిన రీనీ.. ‘‘ తొడ భాగంలో భరించలేని నొప్పి కలుగుతోంది. కొన్ని రోజులు నడవలేకపోయాను. నొప్పిగా ఉందని వైద్యులకు చెబితే ‘నొప్పి సహజమే’ అని సమాధానం ఇచ్చారు. దయచేసి సర్జరీలకు స్వప్తి పలకండి. చావు బ్రతుకుల సమస్య అన్నప్పుడు మాత్రమే సర్జరీలను ఆశ్రయించండి. జిమ్‌కు పోయి సన్నబడటం ఉత్తమం. నా వీడియోలతో ప్రభావితమై సర్జరీలు చేయించుకున్న వారిని క్షమాపణ కోరుతున్నాను’’ అని తెలిపింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు