గాల్లో తాడుపై నడిచాడు.. ఇది మామూలు రికార్డు కాదు!

29 Dec, 2021 20:19 IST|Sakshi

ఇది మామూలు రికార్డా.. ఇప్పటివరకూ ఎవరూ సాహసించనిది.. చూస్తున్నారుగా.. మైలు కన్నా ఎక్కువ ఎత్తులో.. రెండు హాట్‌ఎయిర్‌ బెలూన్ల మధ్య ఎలాంటి ఆధారం లేకుండా.. తాడుపై నడవడమంటే మాటలా మరి.. బ్రెజిల్‌కు చెందిన 34 ఏళ్ల రాఫెల్‌ జుగ్నోబ్రిడి ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. (చదవండి: చరిత్ర సృష్టించిన పాలకొల్లు అమ్మాయి)

బ్రెజిల్‌లో 6,131 అడుగుల ఎత్తులో అంగుళం వెడల్పున్న తాడుపై నడిచి.. సరికొత్త ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా కంటే రెట్టింపు ఎత్తులో చెప్పులు లేకుండా నడిచి టైట్‌రోప్ వాక్‌లో వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. చాలెంజ్‌లంటే తనకెంతో ఇష్టమని.. చిన్న తప్పు జరిగినా.. ఇక అంతే అని తెలిసినప్పటికీ.. ఏకాగ్రతతో దీన్ని సాధించానని రాఫెల్‌ చెప్పాడు. (చదవండి: 15 సెకన్లలో ఏమైతది.. బస్సు రైలైతది.. అదెలా?)

 

మరిన్ని వార్తలు