మరోసారి వైరల్‌గా మారిన బ్రెజిల్‌ యాంకర్‌ వీడియో

26 Sep, 2020 18:23 IST|Sakshi
వీడియో దృశ్యాలు

బ్రెసీలియా : వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఓ టీవీ యాంకర్‌కు భార్య షాక్‌ ఇచ్చింది. అతడు లైవ్‌ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో నగ్నంగా కెమెరాలో కనిపించి అతడ్ని నవ్వుల పాలు చేసింది. గత జులై నెలలో చోటుచేసుకున్న ఈ వీడియో మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌కు చెందిన టీవీ యాంకర్‌ ఫాబియో పోర్‌చాట్‌ జులై 3వ తేదీన ప్రముఖ రాజకీయ నేత గుల్‌హెర్మీ బౌలోస్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో‌ లైవ్‌ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అంతా బాగానే జరుగుతున్న సమయంలో ఫాబియో భార్య నటాలి నగ్నంగా కెమెరా ఎడమ వైపునుంచి కుడివైపునకు దాక్కుని వెళ్లింది. ( వైరల్‌: శునకాలకు ఐపీఎల్‌ ఫీవర్‌!)

ఈ దృశ్యాన్ని చూసిన బౌలోస్‌ గట్టిగా నవ్వుతూ అదేంటని ప్రశ్నించాడు. దీంతో కంగుతిన్న ఫాబియో భార్య వైపునకు తిరిగి మందలించాడు. ఇక చేసేదేంలేక బౌలోస్‌తో కలిసి నవ్వటం ప్రారంభించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావటంతో.. అదికాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ( ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం )

మరిన్ని వార్తలు