వెరైటీ వెడ్డింగ్ పార్టీ.. చూస్తేనే గుండె గుబుల్‌.. ఇక ట్రై చేస్తే..?

29 Jul, 2023 20:14 IST|Sakshi

పెళ్లిరోజు మరుపురాని రోజు. అంతే ప్రత్యేకంగా గుర్తుండిపేయేలా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. మంచి దుస్తులు ధరిస్తారు. రొమాంటిక్ సెటప్‌ చేసుకుని పార్టీ చేసుకుంటారు. మరికొందరు సాంప్రదాయానికి ప్రముఖ్యతనిస్తారు. కానీ మనం తేలుసుకోబోయే జంట మాత్రం తమ వెడ్డింగ్ రోజునే సాహసాలు చేశారు. వెడ్డింగ్‌కి వచ్చిన బంధువులతో ఈ విన్యాసాలు చేశారు. 

వీడియో ప్రకారం.. పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తె ఇద్దరు వెడ్డింగ్ డ్రస్‌లో ఉన్నారు. అది చూడటానికే భయంకరమైన లొకేషన్‌లా ఉంది. లోతైన లోయలో స్కై డైవింగ్ చేస్తూ హౌరా..! అనిపించారు. ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే పేర్లు గల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అదే రోజున థ్రిల్లింగ్ కోసం ఇలా సాహసాలు చేశారు. రయ్.. రయ్ మంటూ రివ్వున లోయలోకి దూసుకెళ్లారు. ఈ వీడియోను తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. 

A post shared by La libreta morada | Mariana (@lalibretamorada)

ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇంత భయంకరమైన స్కై డైవింగ్ పెళ్లి రోజునే ఎందుకు బ్రో అంటూ కామెంట్లు పెట్టారు. 'జర భద్రం ర అయ్యా..!' అంటూ మరికొందర ఫన్నీగా కామెంట్లు పెట్టారు. కొత్తజంట సాహసాలు మీరూ చూసేయండి మరి..!

ఇదీ చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్ 

మరిన్ని వార్తలు