పెళ్లి రోజు వరుడు సర్‌ప్రైజ్‌.. గిఫ్ట్‌ చూసి ఏడ్చేసిన వధువు!

5 May, 2022 19:07 IST|Sakshi

జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేమైనది. అందుకే యువతీ యువకులు వారి పెళ్లి రోజున స్పెషల్స్‌, సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేసుకుంటూ జీవితంలో మరచిపోని రోజులా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు, మెహందీ ఫంక్షన్లు, హల్దీ వేడుకలతో హడావిడీ చేస్తున్నారు. అంతేనా ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడం అవి నెటిజన్లను ఆకట్టుకుంటూ విపరీతంగా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహా ఓ జంట వీడియో గత సంత్సరం నెట్టింట ప్రత్యక్షమైంది. తాజాగా ఆ వీడియో మరో సారి వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది. 

ఆ వీడియోలో ఏముందంటే.. వెడ్డింగ్‌ డే అనేది ప్రతి జంటకు ప్రత్యేకమైన రోజు. అందుకే తమ కుటుంబ సభ్యులు, బంధువులతో, స్నేహితులతో కలిసి ఎప్పటికీ గుర్తుండేలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటితో పాటు తమ జీవిత భాగస్వామికి ఏదైనా మరచిపోని బహుమతిని ఇచ్చేందుకు తాపత్రయ పడడం కూడా సహజమే. అయితే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి తన భార్యకు స్పెషల్‌ గిఫ్ట్‌తో ఆశ్యర్యపరిచాడు.

ఎలా అంటారా.. బ్రెజిల్‌లో ఉంటున్న వధువు తల్లిదండ్రులను విమానంలో పిలిపించి ఆమెకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లా ప్లాన్‌ చేశాడు ఓ వరుడు. ఇక వెడ్డింగ్‌ హాల్‌ నుంచి బయటకు వచ్చిన వధువు తన తల్లిదండ్రలను చూడగానే ఆనందంతో ఒక్కసారిగా వారి ఏడవడం మొదలుపెట్టింది. అనంతరం వారిని కౌగిలించుకుని తన సంతోషాన్ని కనీళ్ల రూపంలో వారికి తెలిపింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సర్‌ప్రైజ్‌ బాగుంది బాస్‌ అంటు కామెంట్ పెట్టారు.

చదవండి: Viral video: చైనా వికృత చర్యలు! బలవంతంగా కరోనా పరీక్షలు

మరిన్ని వార్తలు