జోష్‌లో వంతెన ఓపెనింగ్‌.. పాపం బొక్కలు విరగ్గొట్టుకున్నారు

9 Jun, 2022 18:03 IST|Sakshi

Mexican Footbridge Collapses: నేటీకి కొన్ని దేశాల్లో పురాతన కట్టడాలు, బ్రిడ్జీలు, భవనాలు చక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ, నేటి ఇంజనీర్లు కట్టిన కట్టడాలు, బ్రిడ్జీలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. తాజాగా ఓ బ్రిడ్జీ కట్టి.. ఓపెనింగ్‌ చేసిన కాసేపటికే కూలిపోయింది. దీంతో అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. క్యూర్నావాకా నగరం కట్టిన ఓ బ్రిడ్జ్‌ ప్రారంభోత్సవం రోజునే కూలిపోయింది. ఫుట్‌ బ్రిడ్జ్ ఓపెనింగ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేయర్‌ జోస్‌ లాయిస్‌ ఉరియో స్టెగుయ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. వంతెన ప్రారంభం తర్వాత మేయర్‌ సహా సిటి కౌన్సిల్‌ సభ్యులు బ్రిడ్జీపై నడుచుకుంటూ వెళ్లారు. ఇంతో వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో వారందరూ కింద పడిపోయారు. 

సుమారు 10 అడుగుల ఎత్తులో ఉండే ఆ ఫుట్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో బ్రిడ్జీ మీద ఉన్నవారంతా కింద నీటిలో ఉన్న రాళ్లపై పడిపోయారు. ఈ ఘటనలో మేయర్‌, 20 మంది సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి ఎముకలు విరిగిపోయాయినట్టు స్థానిక మీడియో తెలిపింది. వంతెన ప్రారంభం రోజునే ఇలా జరగడంతో ఇంజనీర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు