బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై బూతులతో రెచ్చిపోయిన నటి.. ఎందుకంటే?

7 Jan, 2023 04:56 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై బూతులతో రెచ్చిపోయింది ప్రముఖ నటి, షీ-హల్క్ వెబ్ సిరీస్ స్టార్ జమీలా జామిల్. ఆయన ప్రభుత్వం ప్రజలను అణగదొక్కాలని చూస్తోందని మండిపడింది. రిషి సునాక్ సంపన్న వర్గానికి చెందిన వాడని, మితవాది అని, అదృష్టం కొద్ది ప్రధాని అయ్యారని ధ్వజమెత్తింది. ఇంగ్లీష్ భాషలో బూతు పదంతో తీవ్ర విమర్శలు చేసింది. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది.

ఎందుకీ విమర్శలు..?
బ్రిటన్‌లో ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని రిషి సునాక్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేయాలని రిషి సునాక్ చూస్తున్నారని జమీలా జామిల్ మండపడింది. ఇది నాయకత్వం కాదు నియంతృత్వం అని ధ్వజమెత్తింది. 
ప్రజలు ఉద్యోగాలు లేక ఆర్థిక సాయం అందక నిరసనలు వ్యక్తం చేస్తుంటే బిలియనీర్ రిషి సునాక్ వాళ్ల నోళ్లు మూయించాలని చూస్తున్నారని, దీన్ని తాము ఎంత మాత్రమూ సహించబోమని జమీలా హెచ్చరించింది. బ్రిటన్ వలసదారులపై రిషి సునాక్ విమర్శలు చేయడాన్ని కూడా తప్పుబట్టింది. బ్రిటన్ కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపొద్దని హితవు పలికింది.
చదవండి: రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు

మరిన్ని వార్తలు