ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్‌

15 Jul, 2022 18:58 IST|Sakshi

UK Owes Apology For Forced Adoptions: అధికారికంగా తల్లి బిడ్డలను వేరుచేసే దారుణానికి పాల్పడిన బ్రిటన్‌ ప్రభుత్వం సదరు బాధిత మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని మానవ హక్కుల ప్యానెల్‌ పేర్కొంది. ఈ మేరకు బ్రిటన్‌ అధికారికంగా పెళ్లికానీ తల్లుల నుంచి తమ పిల్లలను బలవంతంగా దత్తత ఇచ్చేలా చేసిన‍ందుకు గానూ వారికి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. 1949, 1976 మధ్యకాలంలో ఇంగ్లండ్‌, వేల్స్‌ నుంచి దాదాపు లక్ష మందికి పైగా పిల్లలు బలవంతంగా దత్తతకు వెళ్లారని మానవ హక్కులకు సంబంధించిన పార్లమెంట్‌ సంయుక్త కమిటీ నివేదికలో పేర్కొంది. అత్యంత దారుణంగా తల్లి బిడ్డలను వేరు చేసే పాశవిక చర్యకు బ్రిటన్‌ ప్రభుత్వం పాల్పడిందని కమిటీ అధ్యక్షురాలు లేబర్‌ ఎంపీ హ్యారియోట్‌ హర్మాన్‌ అన్నారు.

అంతేకాదు ఆ తల్లుల చేసిన ఏకైక నేరం పెళ్లి కాకుండా గర్భవతి కావడమేనని చెప్పారు. ఇది బ్రిటన్‌ చేసిన ఘోరమైన తప్పుగా కమిటీ పరిగణించింది. స్వయంగా ప్రభుత్వమే ఆ తల్లుల పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్నారు. ఇప్పుడైనా వారికి న్యాయం జరగాలని, వారు గౌరవింపబడేలా చేసేందుకైన బ్రిటన్‌ క్షమాపణలు చెప్పాలని అన్నారు. గతంలో ఆస్ట్రేలియ ప్రభుత్వం, ఐర్లాండ్‌ ఇలానే చేశాయని, అందుకు క్షమాపణలు కూడా చెప్పాయని తెలిపారు. 1963లో ఇంగ్లాండ్‌, వేల్స్‌, స్కాట్లాండ్‌లలో అబార్షన్‌ని చట్టబద్దం చేసినప్పటికీ మహిళలు ఈ సమస్యలను ఎదుర్కోవల్సి వచ్చిందన్నారు. పెళ్లికాకుండా తల్లికావడాన్ని ఘోరంగా చూడటం వల్లే ఈ పరిస్థితి వాటిల్లందని అన్నారు.

ఐతే పార్లమెంట్‌ సంయుక్త కమిటీ నివేదిక  బాధిత వ్యక్తుల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్‌ను అందించడమే కాకుండా మరియు తల్లి లేదా బిడ్డను కనుగొనడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వం సాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో ఒక​ బ్రిటన్‌ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ...ఈ చారిత్రత్మక తప్పిదం వల్ల ప్రభావితమైన వారందరికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. గతాన్ని మార్చలేకపోయినప్పటికీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా బలోపేతమైన చట్టాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. సదరు బాధిత మహిళలకు మెరుగైన సంరక్షణను అందస్తామని చెప్పారు. 

(చదవండి: ఈయూ ఆంక్షాల మోత...టెన్షన్‌లో రష్యా!)

మరిన్ని వార్తలు