బ్రిటన్ రాజకుటుంబం ఆస్తులు విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా?

11 Sep, 2022 09:01 IST|Sakshi

లండన్: రాజవంశస్థులు అంటేనే కోట్ల ఆస్తులకు వారసులు.  అత్యంత సంపన్నులు. మరి బ్రిటన్ రాజకుటుంబం అంటే ఈ లెక్కలు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ఆమె వ్యక్తిగత ఆస్తుల  విలువ, రాజకుటుంబం నికర ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయం చర్చనీయాంశమైంది.  ఆ వివరాలు మొత్తం ఈ ఫొటోలో చూడండి.

నూతన రాజముద్రిక 
రాజకిరీటం, దానికింద సీఆర్‌ అంటూ పొడి అక్షరాలతో కింగ్‌ చార్లెస్‌–3 నూతన రాజముద్రిక రూపుదిద్దుకుంది. సీ అంటే చార్లెస్, ఆర్‌ అంటే రెక్స్‌ (లాటిన్‌లో రాజు) అని అర్థం. రాజుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తన టై మీద ఆయన దీన్ని తొలిసారిగా ధరించారు. చార్లెస్‌ పాలన సాగినంత కాలం బ్రిటన్‌తో పాటు ఇతర కామన్వెల్త్‌ దేశాల కరెన్సీ నోట్లు, నాణాలు, పాస్‌పోర్టులు, సైనిక దుస్తులు, అధికారిక స్టాంపులు తదితరాలన్నింటి మీదా ఇకపై ఈ ముద్రే కన్పించనుంది. ఎలిజబెత్‌ హయాంలో రాజముద్రికపై ఈఆర్‌ (ఎలిజబెత్‌ రెజీనా) అని ఉండేది.

సవరణ
బ్రిటన్‌ రాజకుటుంబం ఆస్తుల గ్రాఫ్‌లో కార్న్‌వాల్‌ ఎస్టేట్‌ విలువ 1,300 కోట్ల డాలర్లు, బకింగ్‌హాం ప్యాలెస్‌ విలువ 4,900 కోట్ల డాలర్లు అని పొరపాటుగా వచ్చింది. వాటిని 130 కోట్ల డాలర్లు, 490 కోట్ల డాలర్లుగా చదువుకోగలరు. 
చదవం‍డి: బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా?

మరిన్ని వార్తలు