దురాక్రమణే లక్ష్యంగా...కిరాయి సైనికులను దింపిన రష్యా

29 Jul, 2022 14:23 IST|Sakshi

Mercenaries unlikely to make up for the loss of regular infantry units: ఉక్రెయిన్‌ పై దాడులకు దిగిన రష్యా ప్రస్తుతం కిరాయి సైనికులను సైతం కథన రంగంలోకి దింపినట్లు బ్రిటన్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో రష్యా సైన్యం తక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ప్రైవేట్‌ మిలటరీ కంపెనీ వాగ్నెర్‌ గ్రూప్‌ నుంచి పేయిడ్‌ ఫైటర్స్‌ని దింపింది. ఇప్పడు మరింత ముందుకడుగు వేసి యుద్ధ కాంక్షతో ఆఖరికి కిరాయి సైన్యాన్ని దింపేందుకు కూడా రెడీ అయిపోయింది.

ఒక రకంగా రష్యా సైన్యం కూడా కాస్త ఒత్తిడికి గురవుతోందని అవగతమవుతోంది. ఏదీ ఏమైన రష్యా ఈ కిరాయి సైనికులతో పదాతిదళ సామార్థ్యాన్ని పూరించడం అసాథ్యం అని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఉక్రెయిన్‌ అధికారులు దక్షిణా ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు భారీగా పునరాగమించినట్లు తెలిపారు. అదీగాక డినిప్రో నదికి పశ్చిమలో రష్య సైన్యం తీవ్ర నష్టం కలిగించనుందని బ్రిటిష్‌  అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే రష్యా అనుకూల వేర్పాలు వాదుల ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా రష్యా సైన్యం చోరబడకుండా అడ్డుకుంది. రష్యా సైన్యం ప్రవేశించకుండా అక్కడ ఉన్న డినిప్రో నదిపై ఉ‍న్న ముడు వంతెనలను ధ్వంసం చేసింది. 

అంతేకాదు ఉక్రెయిన్ తన యుద్ధ విమానాలతో ఖేర్సన్ చుట్టూ ఉన్న ఐదు రష్యన్ బలమైన ప్రాంతాల తోపాటు సమీపంలోని మరొక నగరంపై దాడి  కూడా చేసిందని బ్రిటన్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది.  ఈ నేపథ్యంలోనే రష్యా కిరాయి సైనికులను యుద్ధంలోకి దింపడమే కాకుండా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ శివార్లలోని సైనిక స్థావరాలపై కూడా బాంబు దాడి చేసినట్లు పేర్కొంది. ఈ దాడి కారణంగా సుమారు 15 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సీ కులేబా వెల్లడించారు. 

(చదవండి: చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త... నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపిన మహిళ)

మరిన్ని వార్తలు