ఇడ్లీ బోరింగ్‌ అని ట్వీట్‌.. నెటిజన్లు ఫైర్‌

8 Oct, 2020 17:41 IST|Sakshi

ఇడ్లీ.. అత్యధిక మంది అల్పాహారంగా తీసుకునే వంటకాట్లో ఒక్కటి. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో ఇడ్లీ ప్రియులు ఎక్కువగా ఉంటారు. నిరు పేద నుంచి ధనవంతుల వరకు ఇడ్లీను అల్పాహారంగా తీసుకుంటారు. అలాంటి ఇడ్లీలపై ఓ బ్రిటీష్‌ లెక్చరర్‌ చేసిన ట్వీట్‌.. దక్షిణ భారతీయుల కోపాన్ని చవి చూసింది. ఇడ్లీలు ప్రపంచంలోనే అత్యంత బోరింగ్‌ అల్పాహారం అని ట్వీట్‌ చేశారు. దీంతో ఇండ్లీ ప్రియులు అతన్ని వేసుకున్నారు.  ప్రజలు ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారో తెలియని ఒక వంటకం పేరు చెప్పండి’ పుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ట్వీట్‌ చేసింది. దీనికి చాలా మంది రిప్లై ఇచ్చారు. 

చోల్ భతురే, రాజ్మా చావల్, బిర్యానీ, మోమోస్, ఇడ్లీ వంటి ప్రసిద్ధ ఇష్టమైన వంటకాల పేర్లను పేర్కొన్నారు. అయితే ఒక బ్రిటిష్‌ లెక్చరర్‌ మాత్రం ‘ప్రపంచలో అత్యంత బోరింగ్‌ అల్పాహారం ఇడ్లీ’ అంటూ వివాదస్పద ట్వీట్‌ చేశారు. నార్తంబ్రియా విశ్వవిద్యాలయానికి చెందిన హిస్టరీ లెక్చరర్‌ ఎడ్వర్డ్ ఆండర్సన్‌ ఈ ట్వీట్‌ చేశారు. అయితే దక్షిణ భారతీయులు ఎక్కువగా ఇష్టపడే ఇడ్లీని బోరింగ్‌ అంటావా అంటూ నెటిజన్లు అతనిపై ఫైర్‌ అవువున్నారు. ‘నువ్వు ఎప్పుడైనా తిన్నావా? నీకేం తెలుసు ఇడ్లీల రుచి’, ఇడ్లీల గురించి నీకేం తెలుసు..బిర్యానీ మాత్రమే కాదు.. ఇడ్లీల విషయంలో కూడా దక్షిణ భారతీయులు ఐక్యంగా ఉంటారు’, ‘ఇడ్లీలు కాదు నువ్వే బోరింగ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో కంగుతున్న హిస్టరీ లెక్చరర్‌.. ‘దక్షిణ భారతీయులు నాపై ట్వీట్ల దాడి చేసే ముందు నాకు దక్షిణ భారత్‌ వంటకాలైనా దోశ, అప్పం లాంటి వంటకాలు నచ్చుతాయని తెలుసుకోండి. కానీ ఇడ్లీలు అంటే అంతగా ఇష్టం ఉండదు’ అని ట్వీట్‌ చేశారు. అయినప్పటికీ నెటిజన్ల దాడి ఆగలేదు. దీంతో చివరికి ఆయన క్షమాపణలు చెప్పడంతో ట్వీట్ల దాడి నిలిపివేశారు. 
 

మరిన్ని వార్తలు