రిషి, ద వెండర్‌!

5 Nov, 2022 05:21 IST|Sakshi

మెడలో ట్రే వేలాడదీసుకుని పాపీస్‌ అమ్ముతున్నదెవరో గుర్తు పట్టారు కదూ! అవును. బ్రిటన్‌ ప్రధాని రిషియే. గురువారం ఉదయం పూట మంచి రష్‌ అవర్లో వెస్ట్‌మినిస్టర్‌ మెట్రో స్టేషన్లో ఇలా దర్శనమిచ్చి ప్రయాణికులను సర్‌ప్రైజ్‌  చేశారాయన.

రాయల్‌ బ్రిటిష్‌ లెజియన్‌కు నిధుల సేకరణ కోసం సైనికులతో కలిసి ఇలా వెండర్‌ అవతారమెత్తారు. పేపర్‌తో చేసిన ఒక్కో పాపీని ఐదు పౌండ్లకు అమ్మారు! చాలామంది ఆయన నుంచి వాటిని కొనుగోలు చేస్తూ కన్పించారు. పలువురు రిషితో సెల్ఫీలు తీసుకుంటూ గడిపారు. రిషి చర్యను మెచ్చుకుంటూ, ఆయన వద్ద తాము పాపీస్‌ కొన్నామని పేర్కొంటూ చాలామంది సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. 

మరిన్ని వార్తలు