ట్రినిటీ చర్చి నగరానికి వచ్చి.. రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం

10 Sep, 2022 09:03 IST|Sakshi
బొల్లారంలోని ట్రినిటీ చర్చిలో

70 ఏళ్లపాటు బ్రిటన్‌ను ఏలిన రాణి ఎలిజబెత్‌–2కు హైదరాబాద్‌ మహానగరంతో అనుబంధం ఉంది. చారిత్రక భాగ్యనగరాన్ని ఆమె ఒకసారి సందర్శించి ముగ్ధులయ్యారు. వందల ఏళ్ల నాటి చారి్మనార్, గోల్కొండ కట్టడాలు ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. ఎలిజబెత్‌–2 తన పాలనా కాలంలో మూడుసార్లు భారత్‌కు వచ్చారు. అందులో భాగంగా 1983 నవంబర్‌ 20న ఆమె హైదరాబాద్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చికి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఆమె నానమ్మకు నానమ్మ అయిన విక్టోరియా మహారాణి తన సొంత డబ్బుతో ఈ చర్చిని కట్టించారు. అందుకే ఎలిజబెత్‌–2 ప్రత్యేకంగా ట్రినిటీకి విచ్చేశారు. ట్రినిటీ చర్చిని క్వీన్స్‌ చర్చి అని కూడా పిలుస్తుంటారు. ఆ సందర్భంగానే ఆమె రామచంద్రాపురంలోని బీహెచ్‌ఈఎల్, గోల్కొండ కుతుబ్‌షాహీ టూంబ్స్, చార్మినార్, తదితర ప్రాంతాలను సందర్శించారు. ఎలిజబెత్‌–2తోపాటు ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ కూడా ఆమె వెంట ఉన్నారు. అప్పుడు ఆర్కియాలజిస్ట్‌గా విధులు నిర్వహించిన ఎంఎ ఖయ్యూం వారి వెంట ఉండి నగరంలోని చారిత్రక ప్రదేశాలను పరిచయం చేశారు.
చదవండి: ఎలిజబెత్‌-2 వివాహానికి ఖరీదైన డైమండ్‌ నెక్లెస్‌ను గిఫ్గ్‌గా ఇచ్చిన నిజాం నవాబు

మరిన్ని వార్తలు