ఈరోజు స్పెషల్‌: బ్రదర్స్‌ డే.. ఎందుకో తెలుసా?

24 May, 2021 11:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మే 24వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫాదర్స్‌, మదర్స్‌ డే, లవర్స్‌ డే మాదిరి బ్రదర్స్‌ డేగా ప్రపంచ దేశాలు నిర్వహించుకుంటున్నాయి. సోదరుడు అంటే అన్నాతమ్ముడు ఎవరైనా కావొచ్చు. మనతో ఆత్మీయంగా స్నేహితుడి మాదిరి ఉండే వ్యక్తి సోదరుడు. సోదరులు ఉంటే రక్త సంబంధమే కాదు. మనతో ఆత్మీయంగా ఉండే స్నేహితులను కూడా సోదరులుగా భావించవచ్చు. వారికి కూడా విషెస్‌ చెప్పొచ్చు.

ఈ బ్రదర్స్‌ డే గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి. 2005 నుంచి సోదరుల దినోత్సవం చేసుకోవడం మొదలైంది. అమెరికాలోని అలబామా రాష్ట్రానికి చెందిన శిల్పి, రచయిత సి డేనియర్‌ రోడ్స్‌ బ్రదర్స్‌ డేను తొలిసారిగా చేసుకున్నాడు. అప్పటి నుంచి సోదరుల దినోత్సవం చేసుకోవడం మొదలైంది. మొదట బ్రదర్స్‌ డేను కేవలం అమెరికాలో చేసుకునేవారు. తర్వాతర్వాత అన్ని దేశాల్లో మొదలైంది. ఈ రోజున సోదరులు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని దేశాల్లో వారి సోదరులకు ఇష్టమైనవి వంటకాలు చేసి కలిసి భుజిస్తారు. బ్రదర్స్‌ డేకు కొన్ని దేశాల్లో సెలవు దినం (Public Holiday) కూడా ప్రకటించారు. అన్నాదమ్ములు పరస్పరం తమపై ప్రేమ చాటుకునేందుకు ఉద్దేశించినదే ‘ప్రపంచ సోదరుల దినోత్సవం’.

మరిన్ని వార్తలు