ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్‌ని నైవేద్యంగా ఎందుకు పెడతారంటే......

17 Oct, 2022 11:38 IST|Sakshi

ఆ దేవాలయంలో బుద్ధుడికి వైన్‌ని నైవేద్యంగా పెడతారు. పైగా ఆ దేవాలయం పేరుతో వైన్‌ని విక్రయిస్తారట కూడా. ఇదేం వింత అనుకుంటున్నారా? అక్కడ వైన్‌ని తయారు చేయడం అనేది మంచి పనిగా భావిస్తారు అక్కడి ప్రజలు.

వివరాల్లోకెళ్తే...జపాన్‌లో కొండపై చెట్లతో కూడిన ఒక బౌద్ధ దేవాలయం ఉంది. అక్కడ బుద్ధుడికి ప్రజలు వైన్‌ని నైవేద్యంగా పెడతారు. ద్రాక్ష పండ్ల ఉత్పత్తికి పేరుగాంచిన ఆ ప్రాంతంలోని బౌద్ధ దేవాలయాన్ని ద్రాక్ష దేవాలయంగా పిలుచుకుంటారు అక్కడి ప్రజలు. ఐతే అధికారికంగా మాత్రం ఆ దేవాలయాన్ని డైజెంజీగా వ్యవహరిస్తారు. ఈ దేవాలయం టోక్యోకి సుమారు 100 కి.మీ దూరంలో ఉన్న యమనాషి ప్రాంతంలో ఉంది. బౌద్ధ సన్యాసులు మామాలుగా బౌద్ధ దేవాలయాల వద్ద సేవ చేస్తుంటారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధం. వారు వైన్‌ని తయారు చేసి అందిస్తుంటారు.

ఆ దేవాలయాని ప్రధాన సన్యాసి వైన్యార్డ్‌ కో ఆపరేటివ్‌(వైన్‌ తయారీ కంపెనీకి) గౌరవాధ్యక్షుడు. పురాణల ప్రకారం ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి, గ్యోకీ అనే యాత్రికుడు జపనీస్‌ భాషల యకుషిన్యోరైగా అని పిలిచే ఔషధ బుద్ధుడిని కలలో కలుసుకున్నాడని చెబుతారు. అతను చేతిలో ఒక ద్రాక్ష గుత్తిని పట్టుకుని ఉన్నాడని, యమనాషి నివాసితులకు ఔషధ ప్రయోజనాల కోసం వైన్‌ని ఎలా తయారు చేయాలో నేర్పించినట్లుగా కథకథలుగా చెబుతున్నారు. మరోక కథనం ప్రకారం రైతు కగేయు ద్రాక్ష సాగును అదే ప్రాంతంలో మొదటిసారిగా ప్రారంభించాడని అందువల్ల వైన్‌ని సమర్పిస్తారని కొందరు చెబుతున్నారు.

అయితే ఇక్కడ పెంచే ద్రాక్షలు చైనాకు సంబంధించిన హైబ్రేడ్‌ ద్రాక్ష పండ్ల డీఎన్‌ఏతో పోలి ఉంటుంది. చైనా నుంచి ద్రాక్ష విత్తనాలను తీసుకువచ్చి ఇక్కడ ద్రాక్ష తోటలని పెంచారా? లేక ముందు నుంచి ఇక్కడ ఈ ద్రాక్ష సాగు ఉందా? అనేది ఒక సందేహాస్పదంగా ఉంది. ఈ ఆలయం వద్ద పెంచుతున్న​ ద్రాక్ష తోటల నుంచే వైన్‌ని తయారు చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అంతేగాదు దేవాలయం పేరు మీద ఆ వైన్‌ని విక్రయిస్తారు కూడా. అక్కడి ప్రజలు ద్రాక్ష తోటలను పండించి వైన్‌ని తయారు చేయడాన్ని చాలా మంచి పనిగా విశ్వసిస్తారు.

(చదవండి: అరుదైన సంగీత శస్త్ర చికిత్స: బ్యాండు మేళం వాయిస్తుంటే.. సర్జరీ చేసేశారు)

మరిన్ని వార్తలు