ఇదో ‘అమెజాన్‌ అడవి’

26 Apr, 2022 03:40 IST|Sakshi

ప్రపంచంలో అతి పెద్ద అడవులంటే... అమెజాన్‌ అని మనకు తెలుసు. కానీ వర్జీనియా నగరంలో మరో ‘అమెజాన్‌ అడవి’ నిర్మితమవుతోంది. నగరంలో అడవి ఏంటని ఆశ్చర్యపోతున్నారా! అది ఓ అడవిలాంటి భవనం. దానిని నిర్మిస్తున్నది రీటైల్‌ దిగ్గజం ‘అమెజాన్‌’. ఆ భవనం వివరాలేంటో తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణలోనే కాదు... తమ కార్యాలయాల నిర్మాణంలోనూ ప్రత్యేకతను చాటు కునే సంస్థ అమెజాన్‌. హైదరాబాద్‌లో ఉన్న ఇంద్ర భవనంలాంటి ఆఫీసే అందుకు తార్కాణం.

ఇదే ఇలా ఉందంటే.. సియాటిల్‌లో తన ప్రధాన కార్యా లయం ఎలా ఉండాలి? మూడు గోళాకార భవనా లను పారదర్శకంగా నిర్మించింది. వీటిని పర్యావ రణ హితంగా రూపొందించింది. ఇప్పుడు తన రెండో హెడ్‌క్వార్టర్స్‌ నిర్మాణంలోనూ అదే ప్రత్యేక తను చాటబోతోంది. వర్జీనియాలోని అర్లింగ్టన్‌ కౌంటీని ఇందుకు వేదికగా చేసుకుంది. నగరం నడిబొడ్డున ఎత్తైన పర్వతం, దాని చుట్టూరా పచ్చని చెట్లతో కూడిన అడవిలాంటి భవనాన్ని నిర్మించ నుంది. ఇందుకోసం గతంలో తమ భవనాలను నిర్మించిన ఎన్‌బీబీజే సంస్థనే ఎనుకున్నది.

మన రాష్ట్ర బడ్జెట్‌కు సమానం...  
క్రిస్టల్‌ సిటీగా పేరుగాంచిన వర్జీనియా నగరంలో అమెజాన్‌... 350 అడుగుల ఎత్తైన భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం ఇటీవలే అధికారుల నుంచి ప్లానింగ్‌ అనుమతులు కూడా పొందింది. ఆ భవనం కట్టేందుకు 2.5బిలియన్‌ డాలర్ల (దాదాపు రెండు లక్షల కోట్లు)వ్యయం ఖర్చు చేయనుంది. అంటే దాదాపు మన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో సమాన మన్నమాట.

25వేల మంది ఉద్యోగులు పనిచేసేం దుకు వీలుగా 22 అంతస్తులతో భవనాన్ని నిర్మిస్తు న్నారు. ఇందులో ప్రత్యేకమైన పార్క్, కమ్యూనిటీ హైస్కూల్, అనేక షాప్స్‌ కూడా ఏర్పాటవుతు న్నాయి. ఇక బయటినుంచి చూడటానికి గోపురం లా కనిపించే ఈ భవనం చుట్టూ ర్యాంప్‌... దానికి రువైపులా చెట్లతో నిజంగానే అడవిని తలపిం చనుంది. ర్యాంప్‌ మీదుగా ట్రెక్కింగ్‌ చేస్తూ... భవనం పైవరకూ వెళ్లే వీలు కల్పించను న్నారు. ఈ అమెజాన్‌ అడవి భవనాన్ని ఎక్కాలంటే 2025 దాకా ఆగాల్సిందే.    
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు