మంటల్లో బస్సు.. వరద బాధితుల సజీవ దహనం

13 Oct, 2022 08:04 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ పోర్ట్‌ సిటీ కరాచీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో ఓ రన్నింగ్‌ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే సజీవ దహనం  అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా వరద బాధితులుగా నిర్ధారణ అయ్యింది.

సింధ్‌ ప్రావిన్స్‌ కరాచీ-హైదరాబాద్‌-జామ్‌షోరో నగరాలను కలుపుతూ ఉన్న ఎం-9 మోటర్‌వేపై ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో పది మంది కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు హెల్త్‌ సెక్రెటరీ సిరాజ్‌ ఖ్వాసిం వెల్లడించారు. 

దాదూ జిల్లాకు చెందిన వరద బాధితులకు వేరే చోట తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో వాళ్లను తిరిగి స్వస్థలానికి ప్రైవేట్‌ బస్సులో తీసుకొస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు