బస్సుని ఢీ కొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌... 20 మంది సజీవ దహనం

16 Aug, 2022 13:12 IST|Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్యాసింజర్‌ బస్‌ని ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు . దీంతో  సుమారు 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు.  ముల్తాన్‌ హైవేకి సుమారు 350 కి. మీ దూరంలో ఉన్న లాహోర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కరాచి నుంచి లాహోర్‌కి బయులు దేరుతున్న ప్యాసింజర్‌ బస్సుని ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయని వెల్లడించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి రెస్య్కూ చర్యలు చేపట్టినప్పటికీ ప్రయాణికులను కాపాడటం కష్టతరమైందని అన్నారు.  

ఈ ఘటనలో సుమారు ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారని, ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అ‍న్నారు. ఆయా మృతదేహాలకు డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందజేస్తామని వెల్లడించారు.

ఈ మేరకు పాకిస్తాన్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి పర్వేజ్‌  ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులును ఆదేశించారు. అలాగే మృతి చెందిన బాధిత కుటంబాలు తమ వారిని గుర్తించేలాగా సహకరించాలని అధికారులను కోరారు.

(చదవండి: బస్సు బ్రేకులు ఫెయిలై ఘోర ప్రమాదం.. ఐటీబీపీ సిబ్బంది దుర్మరణం)
 

మరిన్ని వార్తలు