కక్కుర్తి కాదు.. కావాలనే ఆ నవవధువు అలా చేసింది!

26 Apr, 2022 13:10 IST|Sakshi

సోషల్‌ మీడియా.. అక్కడి నుంచి మీడియాకు ఎక్కే నవ వధువుల సంగతి తెలియంది కాదు. మంచి, చెడు, సంబురం-విషాదం..  విషయం ఏదైనా నవవధువులనే పేరుకు ఉన్న క్రేజే వేరు. జీవితంలో పెళ్లి అనేది మధురమైన క్షణాలని, ఆ క్షణాలని మధుర క్షణాలుగా ఆస్వాదించాలని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. అలాంటిది ఇక్కడ ఒక కొత్త పెళ్లి కూతురు చేసిన పని ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది.

కాలిఫోర్నియాకు చెందిన కియారా, జోయెల్‌.. ఇద్దరూ ఈ మధ్యే వివాహంతో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి ఖర్చు అక్షరాల 500 డాలర్లు. అందునా కియారా ధరించిన షెయిన్‌ వెడ్డింగ్‌ డ్రెస్సుకు అయిన ఖర్చు చేసింది కేవలం 47 డాలర్లు. సాధారణంగా పెళ్లిని తక్కువ బడ్జెట్‌లో చేసుకోవాలనే ఉద్దేశం కొందరికి ఉంటుంది. తద్వారా ఖర్చులు మిగుల్చుకోవడంతో పాటు ‘టాక్‌ ఆఫ్‌ ది..’ గా నిలవొచ్చనే ఆశ వాళ్లకు ఉండొచ్చు. కానీ,  ఈ జంట మాత్రం మరీ ఇంత తక్కువతో వివాహం చేసుకోవడం వెనుక నవ వధువు ప్రమేయమే పూర్తిగా ఉంది. 

నవ వధువు కక్కుర్తి.. ఈ విమర్శకు కియారా ఏం సమాధానం చెబుతోందో తెలుసా?.. జీవితంలో పెళ్లి ప్రత్యేకమైన క్షణమే కావొచ్చు. అందుకోసం.. భారీగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావడం ఎందుకు?. స్తోమత లేనప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టే ఆలోచన కూడా నాకు లేదు. అందుకే కొన్ని గంటల పాటు వేసుకునే డ్రెస్సును కూడా సింపుల్‌గా కొనేసుకున్నా. అలాగే..  మా రిలేషన్‌షిప్‌ గురించి ఏమాత్రం తెలియని వాళ్లను పెళ్లికి ఆహ్వానించడం ఎందుకు? వాళ్లకు విందు భోజనాలు పెట్టడం ఎందుకు?.. ఇంట్లో వాళ్లను, దగ్గరి స్నేహితులను మాత్రమే అతిథులుగా భావించాం అని ముక్కుసూటిగా సమాధానం ఇచ్చింది కియారా. 

ఇదిలా ఉండగా.. ఏంజ్‌లెస్‌ క్రెస్ట్‌ హైవే వెంట.. ఓ కొండ ప్రాంతంలో వీళ్ల వివాహం జరిగింది. కేవలం 30 నుంచి 40 మధ్య కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని మాత్రమే వేడుకకు ఆహ్వానించారు. వాళ్లకు తిండి, డ్రింక్స్‌ అందించారు. ఈ భోజనాలకు, కుర్చీలకు, పెళ్లి మండపానికే మాత్రమే  వాస్తవానికి ఈ జంట ఖర్చు పెట్టింది. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో ఇప్పుడీ లో కాస్ట్‌ పెళ్లి మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకోవడంతో పాటు వెరైటీ వెరైటీ కామెంట్లకు వేదిక అవుతోంది.

A post shared by Lovin Malta (@lovinmalta)

మరిన్ని వార్తలు