ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట

27 Apr, 2022 14:41 IST|Sakshi

కాలిఫోర్నియా వీధుల్లో త్వరలో కోట్లాది దోమలు ‘బజ్‌ బజ్‌’ అంటూ తిరగబోతున్నాయి. అంటే అక్కడ దోమలు ఎక్కువయ్యాయని అనుకునేరు. అస్సలు కాదు. బ్రిటన్‌కు చెందిన ఆక్సెటిక్‌ కంపెనీ జన్యుపరంగా మార్పు చేసిన మగ దోమలను వదలబోతోంది. ఇప్పుడీ అవసరం ఏం వచ్చిందని అనుకుంటున్నారా? కాలిఫోర్నియా ప్రాంతంలో వేడి పెరిగి ఇటీవల దోమల బెడద పెరుగుతోందట. వాటిని నియంత్రించేందుకు బ్రిటన్‌ కంపెనీ మగ దోమల్లో జన్యుపరమైన మార్పు చేసి వదలబోతోంది.

బయటి ఆడ దోమలతో ఈ దోమలు కలవడం వల్ల పుట్టబోయే ఆడ దోమలు.. మార్పు చేసిన కొత్త జన్యువు వల్ల యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట. జికా, చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్‌ను వ్యాప్తి చేసే ఏడిస్‌ ఎజిప్టీ దోమలను నియంత్రించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీనికి అమెరికా ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ఇటీవలే అనుమతిచ్చింది. కాలిఫోర్నియా పెస్టిసైడ్‌ రెగ్యులేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతి రావాల్సి ఉంది. అయితే కాలిఫోర్నియా ప్రజలకు ఈ విషయం చెప్పలేదని, వాళ్ల అనుమతి తీసుకోలేదని కొందరు  అంటున్నారు. 
చదవండి👉  ప్రపంచంలోనే సన్న భవనం

మరిన్ని వార్తలు