వరదలతో అతలాకుతలమైన కాలిఫోర్నియా..ఎమర్జెన్సీ ప్రకటించిన జో బైడెన్‌

12 Mar, 2023 09:49 IST|Sakshi

ఎడతెగని వర్షాల కారణంగా కాలిఫోర్నియాలో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో కొండ చరియలు విగిగిపడి చెట్లుకూలడం, హిమపాతం వెల్లువలా రావడం తదితర కారణాలతో రహాదారులన్ని తెగిపోయి నీళ్లతో దిగ్బంధమయ్యి. దీనికి తోడు సమీపంలోని పజారో నదిపై కట్ట తెగి ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోయాయి. దీంతో అధ్యక్షుడు జోబైడెన్‌ అత్యవసర పరస్థితిని ప్రకటించారు. 

పజారో నది సమీపంలో సుమారు 17 వందల మందికి పైగా నివాసితులు ఉన్నారని, వారిలో చాలమంది లాటినో వ్యవసాయ కార్మికులే. ఇప్పటి వరకు అధికారులు ఆ నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 8 వేల మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు తెలిపారు. వాస్తవానికి ఈ పంజారో వ్యాలీ ప్రాంత స్ట్రాబెర్రీలు, యాపిల్స్‌, కాలీప్లవర్‌, బ్రోకలీ, ఆర్టిచోక్‌లను పండించే తీర ప్రాంతం. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ..సంఘటనా స్థలానికి చేరుకున్న డజన్ల కొద్ది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 96 మందిని రక్షించి కౌంటీ షెల్టర్‌లో ఉంచారు. ఈ వరదలు కారణంగా వేలాది మంది నిరాశ్రయులైనట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాదు ఈ వరదల బీభత్సం కారణంగా కాలిపోర్నియా రాష్ట్రం దారుణంగా దెబ్బతిందని, మళ్లీ యాథాస్థితికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ మేరకు పజరా నది సమీపంలోని ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు గవర్నర్ గావిన్ న్యూసోమ్ కార్యాలయం పేర్కొంది. అలాగే రోజలులు సియెర్రా నెవాడా, గోల్డ్‌ కంట్రీకి దక్షిణంగా ఉన్న ఫ్రెస్నో కౌంటీ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.

(చదవండి: ఇద్దరు అమెరికన్‌ ఇండియన్లకు.. కీలక పదవులు)

మరిన్ని వార్తలు