UK Tribunal Rules: బట్టతల ఉన్నవారికి ఊరటనిచ్చే వార్త.. ఇక ఎగతాళి చేశారో అంతే!

14 May, 2022 08:11 IST|Sakshi

లండన్‌: పనిచేసే చోట ఎవరినైనా బట్టతల ఉన్నవారిని వెక్కిరిస్తే లైంగిక వేధింపు కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ ట్రిబ్యునల్‌ తీర్పునిచ్చింది! టోనీ అనే వ్యక్తి కంపెనీలో సూపర్‌వైజర్‌తో వాదనకు దిగాడు. టోనీ బట్టతలను సూపర్‌వైజర్‌ ఎగతాళి చేశాడు. ఈ కేసులో భాగంగా, జుట్టు లేకపోవడంపై కామెంట్లు అవమానించడం కిందకు వస్తాయా, వేధింపుల కిందకా అనే అంశంపై ట్రిబ్యునల్‌ విచారణ జరిపింది. కేవలం బట్టతల ఉందన్న కారణంతో అవమానిస్తే లైంగిక వేధింపేనని తేల్చింది.
చదవండి: జేబులో ఐమాక్స్‌.. యూట్యూబ్‌, సినిమాలు, వీడియోలు అన్నీ చూడొచ్చు

మరిన్ని వార్తలు