రష్యా సైనికుల్లో సన్నగిల్లుతున్న ధైర్యం.. చావు తప్ప మరో మార్గం లేదంటూ..

21 Dec, 2022 16:41 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రోజుకో వ్యూహంతో యుద్ధాన్ని మరింత ముమ్మరం చేస్తామే గానీ వెనక్కి తగ్గేదే లేదని ప్రగల్పాలు పలుకుతున్నారు. పైగా మా దళాలు వివిధ శక్తిమంతమైన క్షిపణులు, బాంబులతో ఉక్రెయిన్‌ని దద్ధరిల్లేలా చేస్తున్నారని కొద్దిరోజుల్లో విజయం సాధిస్తామంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ ఉక్రెయిన్‌లో రష్యా దళాల పరిస్థితి అందుకు చాలా విభిన్నంగా ఉందనడానికి సాక్ష్యం వారి ఫోన్‌ కాల్స్‌.

రష్య బలగాలు తమ ఆవేదనను తమవారితో ఫోన్‌లో వెళ్లబోసుకుంటున్నారు. తమకు సరైన ఆహారం, నీరు లేదని వధించబడతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు పది నెలలుగా సాగుతున్న నిరవధిక యుద్ధంలో రష్యా గణనీయమైన నష్టాన్నే చవి చూసింది. అయినప్పటికీ రష్యా పెద్ద ఎత్తున సైనిక సమీకరణలతో సైనికులను రిక్రూట్ చేసుకుని యుద్ధం చేసేందకు సిద్ధమైంది. కానీ సైనికులు పోరాటం చేయలేక సరైన తిండిలేక నిసత్తువతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది.

ఒక సైనికుడు తన తల్లితో అమ్మ మాకు ఎవరూ సరైన ఆహారం అందించరని, నీటి కోసం గుమ్మడికాయాల నుంచి తీసిని నీటిని వడకట్టుకుని తాగుతున్నామని ఆవేదనగా చెబుతున్నాడు. అధ్యక్షుడు పుతిన్‌ గొప్పగా చెబుతున్న క్షిపణుల ఎక్కడ ఉన్నాయని కొందరూ సైనికులు ప్రశ్నిస్తు‍న్నారు. తమ ఎదురుగా ఎత్తైన భవనం ఉందని, దానిని మన సైనికుల కొట్టలేరు ఎందుకంటే దాన్ని కూల్చడం కోసం కాలిబర్‌ క్రూయిజ్‌ క్షిపణి కావాలని చెప్పాడు.

మరో రష్యా సైనికుడు తల్లి తన కొడుకు తనతో లేడని కన్నీళ్లు పెట్టుకుంది. మరోక పోన్‌ సంభాషణలో ఒక సైనికుడు తాము వెనక్కి వెళ్లేందుకు అనుమతి లేదని, పోరాడేందుకు సరైన ఆర్మీబలం, ఆయుధ బలం గానీ లేవని వాపోయాడు. ఇంకో రష్యా సైనికుడు తన భార్యతో ముగ్గురు సైనికులతో పారిపోయానని, లొంగిపోవాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. మరోక సైనికుడు మమ్మల్ని అందర్నీ చంపేస్తున్నారంటూ భయాందోళనతో చెప్పాడు. ఈ సుదర్ఘీ యుద్ధ రష్యన్‌ మిలటరీలో ధైర్యాన్నీ బలహీనపరిచింది. వారు కుటుంబాలకు చేసిన కాల్స్‌ని బట్టి వారంతా ఎంత నిస్సహాయ స్థితిలో పోరాడుతున్నారో అవగతమవుతోంది.  

(చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్‌! కారణం ఏంటంటే..)

మరిన్ని వార్తలు