Cambodian PM Chaged Date Of Birth: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని

20 May, 2022 20:24 IST|Sakshi

పరిస్థితులు అనుకూలించడం లేదనో, ఏ పని చేసిన కలిసి రావడం లేదనో కొంతమంది పేరు మార్చుకోవడం, పేరులో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం చూసి ఉంటాం. అయితే ఇక్కడ ఓ దేశానికి ప్రధాని కేవలం అదృష్టాన్నే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. అందుకోసం కోసం.. ఏకంగా పుట్టినతేదీనే మార్చుకున్నాడు.  పైగా అంత అత్యున్నతి పదవిలో ఉండి ఆ పని చేయడమే సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు!.
 

కంబోడియా ప్రధాన మంత్రి హన్ సెన్.. పుట్టిన తేది ఏప్రిల్‌ 4, 1951. కానీ ఆయన ఆ తేదీని ఆగస్టు 5, 1952కి చట్టబద్ధంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఇందుకు ఓ బలమైన కారణం ఉందన్నది ఆయన వాదన. హన్‌సెన్‌ సోదరుడు.. సింగపూర్‌లో వైద్యం చేయించుకుని కంబోడియాకు తిరిగి వచ్చిన పదిరోజులకే చనిపోయాడు. దీంతో హన్‌ సెన్‌.. అత్యవసరంగా తన డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను మార్చేసుకోవాలనుకున్నాడు. ఈ అనుహ్యమైన నిర్ణయం వెనుక.. తన సోదరుడి రెండు పుట్టిన రోజుల దోషం కూడా ఉందన్నది ఆయన వాదన. 

వాస్తవానికి కంబోడియా 1975 నుంచి 1979 వరకు ఖైమర్‌ రూజ్‌ పాలన కాలంలో ఉండేది. ఆ సమయంలో చాలామంది అధికారిక రికార్డుల కోల్పోయినందున వల్ల 50 ఏళ్లు పైబడ్డ కంబోడియన్లందరికీ రెండేసి పుట్టిన రోజులు ఉండిపోయాయి. అలా తన సోదరుడికి రెండు పుట్టినరోజులు ఉండడం, రాశిచక్రం దోషం వల్ల చనిపోయి ఉంటాడని హన్‌ సెన్‌ నమ్ముతున్నాడు. 

తన వరకు అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు.. ఒకే పుట్టినరోజు ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. అందుకే చట్టబద్ధంగా.. తన పుట్టిన తేదీని మార్చుకునే అంశంపై.. న్యాయ శాఖ మంత్రి కోయుట్‌ రిత్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన తన కొత్త పుట్టిన తేదీని చట్టబద్ధంగా రిజిస్ట్రర్‌ చేసుకుని.. ప్రకటించే అవకాశం ఉంది. 

(చదవండి: మాతృభాషకు అసలైన గౌరవం... ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా..ఎల్లప్పుడూ కన్నడిగే!)

మరిన్ని వార్తలు