నిజ్జర్‌ హత్య కేసు.. కెనడా మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

27 Jan, 2024 13:48 IST|Sakshi

ఒట్టావో: ఖలిస్తానీ ఉద్యమ నేత హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు విచారణలో భారత్‌ నుంచి పూర్తి సహకారం అందుతోందని కెనడా తాజా మాజీ నేషనల్‌ సెక్యూరిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ అడ్వైజర్‌ జోడీ థామస్‌ తెలిపారు. శుక్రవారం ఆమె తన పదవి నుంచి రిటైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘నిజ్జర్‌ హత్య కేసు విచారణలో భారత్‌ పూర్తిగా సహకరిస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యే దిశగా ముందుకు వెళుతున్నాయి. నిజ్జర్‌ హత్య కేసులో ఇంటిగ్రేటెడ్‌ హోమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ విచారణ చేస్తోంది. విచారణ సాఫీగా సాగేందుకు భారత్‌ మాతో కలిసి పనిచేస్తోంది’ అని థామస్‌ చెప్పారు.

కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియాలో ఉన్న సర్రే నగరంలో 2023 జూన్‌ 18న నిజ్జర్‌ హత్య జరిగింది. ఈ హత్యకు భారత్‌ రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌(రా) వింగ్‌కు చెందిన ఏజెంట్లకు ఉన్న లింకుపై విచారణ చేపట్టామని  కెనడా  ప్రధాని జస్టిన్‌ ట్రూడో అప్పట్లో ఆ దేశ హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాలు  రాయబారులను పరస్పరం  బహిష్కరించాయి. ట్రూడో వ్యాఖ్యలు అభ్యంతరకరమని అప్పట్లో భారత్‌ ఖండించింది. 

ఇదీచదవండి.. వేధింపుల కేసులో భారత అమెరికన్‌ జంటకు 20 ఏళ్ల జైలు 

whatsapp channel

మరిన్ని వార్తలు