కెనడా సుప్రీంకోర్టుకు భారత మూలాలున్న వ్యక్తి నామినేట్‌

19 Jun, 2021 19:00 IST|Sakshi

టొరంటో: కెనడా సుప్రీంకోర్టుకు భారత మూలాలున్న న్యాయమూర్తి జస్టిస్‌ మొహ్మద్‌ జమాల్‌ను కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో నామినేట్‌ చేశారు. కెనడా సుప్రీం కోర్టుకు నామినేట్‌ అయిన మొదటి శ్వేతేతర వ్యక్తి జమాల్‌ కావడం విశేషం. ప్రస్తుతం పదవీ విర మణ చేయనున్న రోసాలీ సిలబెర్‌ మాన్‌ అబెల్లా స్థానంలో జమాల్‌ తన విధులు నిర్వర్తి స్తారని ట్రూడో స్పష్టం చేశారు. దేశ ఉన్నత న్యాయస్థానంలో జమాల్‌ తన విధు లను చక్కగా నిర్వర్తిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. ఆయన్ను నామినే ట్‌ చేయడం కూడా సంతోషంగా ఉందని చెప్పారు.   జమాల్‌ 1981లో కెన్యాలో పుట్టినప్పటికీ, ఆయన మూలాలు భారత్‌లో ఉన్నాయి. 

చదవండి: ఇరాన్‌లో ఎలక్షన్‌.. హైదరాబాద్‌లో ఓటింగ్‌

మరిన్ని వార్తలు