నీ పిచ్చి పాడుగాను.. బతుకుదామనేనా!

6 Feb, 2021 09:28 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చి రీపర్‌

10 సెకన్లలో మూడు మిర్చిలను నమిలి మింగేశాడు

కెనడా: ఎంత కారం ఇష్టపడేవారైనా మోతాదుకు మించి నోటికి కారం తగిలితే అబ్బా..మంట మంట అని అరుస్తారు. అటువంటిది కెనడాకు చెందిన మైక్‌ జాక్‌ ప్రపచంలోనే అత్యంత కారం కలిగిన ‘కరోలినా రీపర్‌’ మిరపకాయలను మూడింటిని అవలీలగా తినేసి ఔరా అనిపించాడు. రీపర్‌ మిరపకాయ చిన్న ముక్క తినాలన్నా చాలా మంది భయపడుతుంటారు. మైక్‌ మాత్రం 10 సెకన్లలో మూడు మిరపకాయలు నమిలి మింగేసాడు. దీంతో ఇప్పటివరకు గిన్నిస్‌ వర్‌ల్డ్‌ రికార్డ్స్‌లో ఉన్న రికార్డులను అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పాడు. 

ఒక్కో మిరపకాయ దాదాపు 5 గ్రాముల బరువు ఉంటుంది. ఆరేళ్ల తర్వాత  అత్యంత కారంతో కూడిన మిరప కాయ తిని మైక్‌ రికార్డు బద్దలు కొట్టాడని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకటించింది. అయితే మైక్‌ భవిష్యత్తులో 8 రీపర్‌ మిరపకాయలు తిని రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ ఇతడి స్టంట్‌ చూసిన జనాలు.. నీ పిచ్చి పాడుగాను.. బతుకుదామనేనా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు