మా నాన్నకు 27 మంది భార్యలు!

23 Jan, 2021 16:53 IST|Sakshi

వాషింగ్టన్‌: బ్రిటీష్‌ కొలంబియాకు చెందిన మెర్లిన్‌ బ్లాక్‌మోర్‌ది చాలా పెద్ద కుటుంబం. వాళ్ల ఫ్యామిలీలో సుమారు 160 మందికి పైగా సభ్యులు ఉంటారు. ఉమ్మడి కుటుంబం అనుకుంటున్నారేమో! అయితే మీరు పప్పులో కాలేసినట్లే..! మెర్లిన్‌కు సుమారు 149 మంది తోబుట్టువులు ఉన్నారు. తల్లులు వేరైనా వాళ్లందిరకీ తండ్రి మాత్రం ఒక్కడేనట. మెర్లిన్‌ తండ్రి విన్‌స్టన్‌ బ్లాక్‌మోర్‌కు 27 మంది భార్యలు ఉన్నారు. వాళ్ల(22 మందికి మాత్రమే పిల్లలు ఉన్నారు) ద్వారా ఆయనకు కలిగిన సంతానమే వీరంతా. 

ఇన్నాళ్లు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన మెర్లిన్‌, తన కుటుంబం గురించిన రహస్యాన్ని ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా బహిర్గతం చేశాడు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఈ టీనేజర్‌(19)కు గత మూడేళ్లుగా తండ్రి విన్‌స్టన్‌తో సంబంధాలు లేవట. అయితే తోడబుట్టిన వాళ్లతో మాత్రం ఇప్పటికీ టచ్‌లో ఉంటూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటాడట. వీలు చిక్కినప్పుడల్లా అంతా ఒక్కచోట చేరి వేడుక జరుపుకోవడం తమకు అలవాటు అంటున్నాడు మెర్లిన్‌.(చదవండి: ప్రేయసితో యువతి.. ఒక్క ట్వీట్‌తో!

మామ్‌, ‘మదర్‌’ అని పిలుస్తారు..
మెర్లిన్‌కు మర్రే, వారెన్‌ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇక కన్నతల్లిని మామ్‌ అని, సవతి తల్లులను మదర్‌(వారి ఫస్ట్‌నేమ్‌ జతకలిపి) అని పిలుస్తారట. ‘‘మహా అయితే ఒక ఇంట్లో ఇద్దరు తల్లులు ఉంటారు. కానీ మా ఇంట్లో మొత్తం 27 మంది’’ అని మెర్లిన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఈ విషయాలను పంచుకున్నాడు.
ఏంటి ఇంత మందిని పెళ్లి చేసుకుంటే చట్టం ఆమోదిస్తా అనే కదా మీ సందేహం! స్థానిక చట్టాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నందుకు గానూ విన్‌స్టన్‌(64)పై కేసు నమోదైంది. ఆరునెలల పాటు ఆయనకు గృహ నిర్బంధం విధించారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు