పువ్వును వాసన చూసి నరకం అనుభవించిన అమ్మాయిలు

2 Jul, 2021 10:56 IST|Sakshi
ఏంజిల్స్‌ ట్రంపెట్‌ను వాసన చూస్తున్న రఫెలా

ఒట్టావా : కొన్ని కొన్ని సార్లు కటౌట్‌ చూసి నమ్మటం మనల్ని ప్రమాదంలో పడేయొచ్చు. బయట కనిపించే అందం లోపలి మంచికి ఎప్పటికి కొలమానం కాదు. ఈ విషయం ఏంజిల్స్‌ ట్రంపెట్‌ పువ్వును వాసన చూసిన ఆ ఇద్దరు యువతులకు ఎరుకలోకి వచ్చింది. ఆ అందమైన పువ్వు వారిని ప్రాణాపాయంలో పడేసింది. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని టొరొంటోకు చెందిన సింగర్‌, పాటల రచయిత రఫెలా వేమ్యాన్‌ కొద్దిరోజుల క్రితం తన మిత్రురాలితో ఓ బర్త్‌డే పార్టీకి వెళుతోంది. మార్గం మధ్యలో ఓ పొడవాటి పువ్వు వీరి దృష్టిని ఆకర్షించింది. దీంతో వారు దాని దగ్గరకు వెళ్లారు. రఫెలా పువ్వును తెంపి చేతుల్లోకి తీసుకుంది. అనంతరం ఇద్దరూ దాన్ని వాసన చూశారు.

దీన్నంతా వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి బర్త్‌డే పార్టీలోకి అడుగు పెట్టిన వీరి ఆరోగ్య పరిస్థితి కొంచెం కొంచెంగా క్షీణించసాగింది. దీంతో ఇంటికి వచ్చేశారు. ఇంటి దగ్గర తన పరిస్థితి వివరిస్తూ..‘‘ నా శరీరం నా ఆధీనంలో లేకుండా పోయింది. వచ్చి బెడ్‌పై పడుకున్నాను. కొద్ది సేపటి తర్వాత బ్లాక్‌ డ్రెస్‌ వేసుకున్న మనిషి నా గదిలోకి ప్రవేశించాడు. బెడ్‌పై నా పక్కన కూర్చున్నాడు. అతడు నాకు ఇంజెక్షన్‌ వేస్తుంటే కదలేని.. మాట్లాడలేని.. అరవలేని స్థితిలో ఉన్నాను. మూలుగుతూ పడుకుని ఉన్నాను’’ అని రఫెలా తెలిపింది. అయితే అదృష్టవశాత్తు ఆ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

ఏంజిల్స్‌​ ట్రంపెట్‌ : 
రఫెలా వాసన చూసిన అందమైన ఆ పువ్వు పేరు ఏంజిల్స్‌ ట్రంపెట్‌. ఇది విషపూరితమైనది. స్కోపోలమైన్‌ అనే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన డ్రగ్‌ఇందులో ఉంటుంది.

A post shared by * 𝐑𝐀𝐋𝐏𝐇 * (@songsbyralph)

మరిన్ని వార్తలు