కెనడాలో 2025 దాకా ట్రూడో చేతికే పగ్గాలు

23 Mar, 2022 07:48 IST|Sakshi

టొరంటో: కెనడాలో జస్టిన్‌ ట్రూడో 2025 దాకా ప్రధాని పీఠంపై కొనసాగనున్నారు. అధికార లిబరల్‌ పార్టీ, విపక్ష న్యూ డెమొక్రటిక్‌ పార్టీ్ట(ఎన్‌డీపీ) మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దీనికి న్యూ డెమొక్రటిక్‌ పార్టీ ఓకే చెప్పాల్సి ఉందని సమాచారం.

గత సెప్టెంబర్‌లో కెనడా పార్లమెంట్‌ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని అధికార లిబరల్‌ పార్టీ 338 స్థానాలకుగాను 159 చోట్ల గెలిచింది. అయితే మెజారిటీ దక్కించుకోలేకపోయింది. దీంతో జగ్మీత్‌సింగ్‌ నేతృతృంలోని విపక్ష ఎన్‌డీపీ మద్దతు ట్రూడో ప్రభుత్వానికి అవసరమైంది. 2015లో 43 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ట్రూడో రికార్డు సృష్టించారు. 

చదవండి: (Ukraine Russia War: రసాయన దాడి ఖాయం: బైడెన్‌)

మరిన్ని వార్తలు