Canon Technology: నవ్వితేనే ఎంట్రీ.. నవ్వుతూ పని చేయాల్సిందేనా?

18 Jun, 2021 14:17 IST|Sakshi

ఆఫీస్‌ పరిధిల్లో సీసీ కెమెరాలు, ఐరిష్‌ మెషిన్లు ఉద్యోగుల కదలికలను, హాజరును పరిశీలించేందుకు ఏర్పాటు చేస్తుంటాయి కంపెనీలు. అయితే చైనాలోని కొన్ని ఆఫీసుల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగులు ఆఫీస్‌లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా నవ్వాల్సిందే. ఈ మేరకు స్మైల్‌ రికగ్నిషన్‌ కెమెరా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 

ఆఫీసుల్లోకి ప్రవేశించడం మాత్రమే కాదు.. పర్సనల్‌ పీసీలు ఆన్‌ చేయాలన్నా, లంచ్‌ యాక్సెస్‌, మీటింగ్‌లకు అటెండ్‌ కావాలన్నా ఎంప్లాయి నవ్వాల్సిందే. ఇందుకు సంబంధించి కెనన్‌ కంపెనీ, అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ సాయంతో స్మైల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ డెవలప్‌ చేసింది. పని చేసే టైంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది ఈ టెక్నాలజీ మానిటరింగ్‌ చేస్తుందని కెనన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తెలిపింది. ప్రయోగాత్మకం మరో 30 దేశాల్లో(భారత్‌తో సహా) ఈ టెక్నాలజీకి ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని భావిస్తున్నట్లు కెనన్‌ ఒక స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.

నిజానికి​ స్మైల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను కిందటి ఏడాదే డెవలప్‌ చేసినప్పటికీ.. అది అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. అయితే ఈ ఏడాది బీజింగ్‌లో కొన్ని టాప్‌ కంపెనీలు ఈ టెక్నాలజీని అనుమతించడంతో ప్రముఖంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీపై విమర్శలు ఉన్నప్పటికీ.. ఇది ఉద్యోగుల మానస్థితిని అదుపు చేస్తుందని, వాళ్లను వందకి వంద శాతం సంతోషంగా ఉంచుతాయని కంపెనీలు వివరణలు ఇచ్చుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మాస్కులు పెట్టుకున్న ఉద్యోగుల సంగతేంటని కొందరు సెటైర్లు వేస్తుండడం కొసమెరుపు.

చదవండి: ఆర్టిఫిషీయల్‌ మూడో కన్ను!

మరిన్ని వార్తలు