నింగి నుంచి నీళ్లలోకి...!

25 Sep, 2022 07:52 IST|Sakshi
ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యాక రన్‌వే దాటి దూసుకెళ్లి సరస్సులోకి ఒరిగిన సరకు రవాణా విమానం

దక్షిణ ఫ్రాన్స్‌లోని మోంట్‌పిల్లర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యాక రన్‌వే దాటి దూసుకెళ్లి సరస్సులోకి దూసుకెళ్లింది ఓ సరకు రవాణా విమానం. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో బోయింగ్‌ 737 కార్గో విమానంలో మొత్తం ముగ్గురు ఉన్నారు. విమానాన్ని తొలిగంచే వరకు ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని సరస్సులోకి దూసుకెళ్లగా  విమానంలోని ఒక ఇంజిన్‌ నీటిలో మునిగిపోయింది. శనివారం తెల్లవారుజామున పారిస్‌ ఛార్లెస్‌ డీ గౌల్లే ఎయిర్‌పోర్ట్‌ నుంచి మోంట్‌పిల్లర్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన క్రమంలో ప్రమాదం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: 8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ

మరిన్ని వార్తలు