ఆమెకు వివక్షత వేధింపులే వరంగా మారాయి...ఏకంగా రూ. 72 లక్షలు గెలుపొందింది

21 May, 2022 15:46 IST|Sakshi

కంపెనీల్లో కొంతమంది సహోద్యోగులతో తొందరగా కలవలేక ఇ‍బ్బంది పడుతుంటారు. అలాగే సహోద్యోగులు కొంతమంది తమ తోటి ఉద్యోగులు అనే భావం లేకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అందులోనూ మహిళలైతే ఇలాంటి సమస్యలు మరింతగా ఎదుర్కొంటారు. కొంతమంది తమ కంటే బాగా పనిచేస్తుందన్న అక్కసుతో లేక తమ కంటే తక్కువ కులం అనో  తమతో కలవనీకుండా దూరం పెడతూ ఆవేదనకు గురయ్యేలా చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక ఆమె ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంది. ఐతే ఆమె పోరాడి అందుకు ప్రతిగా పరిహారాన్ని కూడా అందుకుంది.

వివరాల్లోకెళ్తే....లండన్‌లోని స్ట్రాట్‌ఫోర్డ్‌లో ఆస్పర్స్ క్యాసినో అనే గేమింగ్‌ కంపెని ఉంది. 51 ఏళ్ల రీటా లెహెర్ అనే అమె ఆ కంపెనీ క్వాషియర్‌గా పనిచేస్తోంది. ఐతే ఆమె ఆఫ్రికన జాతికి చెందని మహిళ. దీంతో ఆకంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆమెను దూరం పెట్టేవారు. ఆఫీసులో జరిగే ఎలాంటి ఫంక్షన్‌లకి, పార్టీలకి ఆమెని పిలిచేవారు కాదు. రీటాకి గేమింగ్‌ కంపెనీలో 22 ఏళ్ల అనుభవం ఉంది. ఆమె ఆ కంపెనీలో హై-ఎండ్ డీలర్‌గా, షాప్‌ మేనేజర్‌గా కూడా విధులు నిర్వర్తించింది. కానీ ఆమెకు కంపెనీలో సహోద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి తగిన గుర్తింపు గానీ గౌరవం గానీ లేదు. అంతేకాదు ఆమె ప్రమోషన్‌ కోసం చేసుకున్న దరఖాస్తులను కూడా పదేపదే తిరస్కరింపబడేవి.

దీంతో ఆమె చాలా ఏళ్లు విసిగిపోయి ఒక దశలో కంపెనీకి రిజైన్‌ చేసి వెళ్లిపోవాలనుకుంది కూడా. ఇక ఈ జాతి వివక్షతకు చెక్‌పెట్టాని నిర్ణయించుకుని పై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కంపెనీ ప్యానెల్‌ ఈ విషయమై పూర్తిగా విచారణ జరిపింది. రీట్‌ జాతి వివక్షతకు గురిఅవ్వడమే కాకుండా సహోద్యోగులు ఆమె పట్ల నడుచుకున్న తీరు, ఆమె పడిన మానసిక క్షోభను అర్థం చేసుకుంది.

సహోద్యోగులు, అధికారులు ఒక ఉద్యోగిని వివక్షతకు గురిచేస్తే ఆ ఉద్యోగి పనిపై తీవ్రప్రభావం పడుతుందని, తన చుట్టు ఉన్న వాతావరణం బాగుంటేనే ఆ ఉద్యోగి నూతనోత్సహంతో పనిచేయగలుగుతుందని ఇది సహించలేనిదని తెలిపింది.  రీటా ఎదుర్కొన్న వివక్ష వేధింపులకు పరిహారంగా ఆమెకు సుమారు రూ 72 లక్షలు అందజేయనున్నట్లు కూడా ప్రకటించింది. 

(చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని)

మరిన్ని వార్తలు