ఆ దేశ జనాభాలో 3కోట్ల మంది బ్యాచిలర్సే

18 May, 2021 11:54 IST|Sakshi

బీజింగ్‌: ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. ఆ దేశ జన గణన ఈ సంవత్సరం చేశారు. తాజాగా చేసిన జనగణనలో విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో ముఖ్యంగా పెళ్లి కాని వారు అధికంగా ఉన్నారని తేలింది. ఈ విషయం తాజాగా చేసిన జనాభా లెక్కల్లో వెల్లడైంది. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున పెళ్లి కాని ప్రసాద్‌లే ఉన్నారు. చైనా జనాభా లెక్కల వివరాలను మే 11వ తేదీన విడుదల చేసింది. 

ఈ లెక్కల ప్రకారం జనాభా వృద్ధి రేటు తగ్గడం ఆందోళన కలిగించే అంశం. అయితే చైనా పాటించిన విధానం ప్రభావంతో ప్రస్తుతం పెళ్లి కాని పురుషులు అధికంగా ఉన్నారు. లింగ సమతుల్యత పాటించకపోవడం వలన ఈ సమస్య ఏర్పడిందని మేధావులు చెబుతున్నారు. 30 మిలియన్ల(3 కోట్లు) పెళ్లి కాని పురుషులు ఉన్నారని చైనా ఏడవ జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో 111.3 పురుషులకు వంద మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంతకుముందు 2010లో 118.1 పురుషులకు వంద మంది అమ్మాయిలు ఉన్నారు. గత లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం లింగ నిష్పత్తి కొంత మెరుగైందనే చెప్పవచ్చు. కానీ ఆశించిన స్థాయిలో లింగ నిష్పత్తి లేదు. ఒకరు మాత్రమే అనే విధానంతో లింగ అంతరం సమస్య పెరిగింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు