కరాచీలో దిగిన హైదరాబాద్‌ చార్టర్‌ ఫ్లైట్‌.. విమానంలో 12మంది ప్రయాణికులు!

16 Aug, 2022 10:48 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌కు చెందిన 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ చార్టర్‌ ఫ్లైట్‌ పాకిస్థాన్‌, కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఆ విమానం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కరాచీలో దిగినట్లు అంతర్జాతీయ మీడియాలు వెల్లడించాయి. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే 12 మంది ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అయితే, కరాచీలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసేందుకు గల కారణాలు తెలియరాలేదు.

విమానం ల్యాండింగ్‌ను భారత పౌర విమానయాన సంస్థ(సీఏఏ) ధ్రువీకరించింది. అంతర్జాతీయ ఛార్టర్‌ ఫ్లైట్‌ భారత్‌ నుంచే వెళ్లిందని, ఆ తర్వాత సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొంది. గత నెలలో సాంకేతిక సమస్యలతో రెండు విమానాలు కరాచీలో దిగిన తర్వాత ఈ ఛార్టర్‌ విమానం ల్యాండింగ్‌ అయింది. అంతకు ముందు స్పైస్‌జెట్‌ ఢిల్లీ-దుబాయ్‌ విమానం జులై 5న కరాచీకి మళ్లించారు. అలాగే.. షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మరో విమానం జులై 17న కరాచీలో దిగింది.

ఇదీ చదవండి: భారత్‌ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్‌’

మరిన్ని వార్తలు