చైనా రక్షణ బడ్జెట్‌ 7% పెంపు

6 Mar, 2022 06:18 IST|Sakshi

బీజింగ్‌:  చైనా  తన సాయుధబలగాల కోసం ఈస ారి బడ్జెట్‌ కేటాయి ంపులు పెంచింది. గత ఏడాదితో పోలిస్తే 7.1 శాతం ఎక్కు వగా 230 బిలియన్‌ డాలర్లకు డిఫెన్స్‌ బడ్జెట్‌ను పెంచుకుంది. భారత్‌ తన రక్షణ అవసరాలకు కేటాయిస్తున్న బడ్జెట్‌ మొత్తంతో పోలిస్తే ఈ బడ్జెట్‌ ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.45 ట్రిలియన్‌ యువాన్ల రక్షణ బడ్జెట్‌ ముసాయిదా ప్రతిపాదనలను చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ శనివారం ఆ దేశ పార్లమెంట్‌(నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌)లో ప్రవేశపెట్టారు.

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో తమ ప్రాభల్యాన్ని కొనసాగించేందుకు చైనా ఇలా తన రక్షణ బడ్జెట్‌ను ప్రతి ఏటా పెంచుకుంటూ పోతోంది. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)ను మరింత పటిష్టచేసేందుకు, చైనా సమగ్రత, సార్వభౌమత్వం, దేశ ప్రయోజనాలు, రక్షణలను దృష్టిలో ఉంచుకుని రక్షణ బడ్జెట్‌ పెంచామని ముసాయిదా పత్రాల్లో కెకియాంగ్‌ పేర్కొన్నారు. అయితే, 2017లో చైనా మొత్తం సాయుధ బలగాల సంఖ్యను 23 లక్షల నుంచి 20 లక్షలకు కుదించుకోవడం గమనార్హం. 2012లో అధికార పగ్గాలు చేపట్టాక అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ముఖ్యంగా సైన్యం పటిష్టతపైనా దృష్టిపెట్టారు.

మరిన్ని వార్తలు