43 యాప్స్‌పై బ్యాన్‌: అభ్యంతరం తెలిపిన చైనా

25 Nov, 2020 12:19 IST|Sakshi

న్యూ ఢిల్లీ: దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత దృష్ట్యా చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 మొబైల్‌ అప్లికేషన్లపై చర్యలు చేపట్టింది. హోంమంత్రిత్వశాఖ నేతృత్వంలోని సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ కేంద్రం నుంచి సమగ్ర నివేదికలపై చర్చించిన అనంతరం ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనా యాప్ ల నిషేధంపై భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ స్పందించారు. చైనా కచ్చితంగా ఈ నిషేధింపు చర్యను ఖండిస్తుంది అని తెలిపారు. (చదవండి: భారీ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3)

"చైనా నేపథ్యం ఉన్న యాప్ లను నిషేదించటానికి భారత ప్రభుత్వం 'జాతీయ భద్రత' అనే పదాన్ని పదేపదే ఉపయోగించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది. భారతదేశంలో అన్ని మార్కెట్ ఆటగాళ్లకు న్యాయమైన, నిష్పాక్షికమైన, వివక్షత లేని వ్యాపార వాతావరణాన్ని అందిస్తుంది" అని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రోంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మే నెలలో లడఖ్‌ సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సమాచార గోప్యత దృష్ట్యా ఇప్పటికే 177 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా 43 మొబైల్‌ యాప్‌లపై కొరడా ఝుళిపించింది. తాజాగా నిషేధించిన యాప్‌లలో చైనా రిటైల్‌ దిగ్గజ కంపెనీ అలీబాబా గ్రూప్‌నకు చెందిన నాలుగు యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన మరికొన్ని యాప్‌లూ ఉన్నాయి. 

మరిన్ని వార్తలు