అమెరికాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: చైనా

7 Aug, 2020 16:38 IST|Sakshi

బీజింగ్‌: చైనా సోషల్‌ మీడియా దిగ్గజ యాప్‌లైన టిక్‌టాక్, వీ‌చాట్‌లపై అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక 45 రోజుల్లోగా టిక్‌టాక్‌‌ సంస్థతో లావాదేవీలను రద్దు చేసుకోవాలని అమెరికా సంస్థలను ట్రంప్ ఆదేశించడం ‘అణచివేత’ చర్య అంటూ చైనా అసహనం​ వ్యక్తం చేసింది.  ఈ విషయంలో చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్బిన్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వినియోగదారులు, కంపెనీల ఖర్చులపై అమెరికా ఆంక్షలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
(చదవండి: టిక్‌టాక్‌ కొనుగోలు: కీలక ఉత్తర్వులు!)

అంతేగాక తరచూ తమ దేశ శక్తిని కించపరిచేలా ట్రంప్‌ చర్యలు ఉన్నాయని, అమెరికా కానీ సంస్థలను ట్రంప్‌ ప్రభుత్వం అన్యాయంగా అణచివేస్తోందన్నారు. అగ్రరాజ్యం సంస్థల, వినియోదారుల వ్యయ హక్కులు, ప్రకయోజనాలపై ఏకపక్ష రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఇది ట్రంప్‌ అణచివేతకు ఉదాహరణ అన్నారు. అయితే గ్లోబల్‌ టెక్నాలజీలో చైనా శక్తిని అరికట్టేందుకే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ వర్గాలు స్పష్టం చేశాయి. టిక్‌టాక్‌, వీ‌చాట్‌ వల్ల భవిష్యత్‌లో  జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థకు ముంపుని ట్రంప్‌ పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: టిక్‌టాక్‌ విక్రయం : చైనా వార్నింగ్?)

మరిన్ని వార్తలు